నిజమైన తండ్రి నమ్మకం: సిటీ టెక్కీ నీలిమ క్షేమం
ఖాట్మాండ్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నీలిమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఆమె స్నేహితురాలు సోమవారం నీలిమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో నీలిమ తండ్రి తన కూతురు క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం నిజమైనట్లైంది.
హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం సంతోష్‌నగర్‌వాసి నీలిమ ఎవరెస్టు అధిరోహణలో ఎంపికై నేపాల్ వెళ్లింది. ఏప్రిల్ 18న శంషాబాద్ విమానాశ్రయంలో బయల్దేరే ముందు 21మంది బృందంతో తాను ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్తున్నానని కుటుంబసభ్యులకు చెప్పింది.

కాగా, ఏప్రిల్ 19న ఢిల్లీ నుంచి ఖాట్మాండ్ వెళ్లిన నీలిమ చివరిసారిగా ఏప్రిల్ 22న తల్లితో మాట్లాడింది. భూకంపం అనంతరం నీలిమ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని తల్లిదండ్రులు శౌరయ్య, కొండవీటి పాప ఆదివారం తెలిపారు.
నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా పర్వతాసానువులు విరుచుకుపడటంతో 20 మంది పర్వతారోహకులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీలిమ ఆచూకీ లభ్యం కాకపోయేసరికి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, నీలిమ క్షేమంగా ఉన్నట్లు ఆమె స్నేహితురాలు, అహ్మదాబాద్‌కు రింకు దేశాయి శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం పంపింది. వీరి బృందం ప్రస్తుతం టింగో అనే గ్రామంలో ఉన్నట్లు నీలిమ భర్తకు తెలిపింది. ఈ సమాచారాన్ని ట్రావెల్స్ సంస్థ నీలిమ తండ్రికి చేరవేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications