నగరంలో 'నేపాలీ గ్యాంగ్' హల్ చల్.. పట్టపగలే చోరీలు..!

హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం జనాభా 1.12 కోట్లు ఉండొచ్చని అంచనా. భాగ్యనగరంలో 2023లోనే కోటి జనాభా దాటింది. లక్షలాది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. పేద, మధ్య తరగతి నుంచి బిలియనీర్ల వరకూ ఇక్కడ స్థిరపడ్డారు. అలాగే అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. దీంతో హైదరాబాద్ మహా నగరం మినీ ఇండియాగా అభివృద్ధి చెందుతోంది. అయితే నగరంలో నేపాలీ గ్యాంగ్ మరోసారి హల్ చల్ చేస్తోంది. ఇందుకు తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం..

సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో పనివాళ్లుగా నటిస్తూ ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి అక్కడి నుంచి డబ్బు, నగలతో పరార్ అయిన ఘటన ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓనర్ ఇంట్లో నుంచి దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారు నగలు, డబ్బుతో నేపాలీ గ్యాంగ్ జంప్ అయినట్లు సమాచారం. యజమాని చేతులు, కాళ్లు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌.. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్‌ రాక్‌ ఎన్‌క్లేవ్‌ లో ఈ దోపిడీ జరిగింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్‌ గిరి (75) అనే వ్యక్తి ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు.. ఈ దారుణానికి పాల్పడ్డారు. గత నెలలోనే పనిలో చేరిన వీళ్లు.. నమ్మకస్తులుగా నటిస్తూ.. ఇలా అదును చూసి చోరీకి పాల్పడ్డారు. ఇటీవల గిరి.. తన భార్య, కుటుంబంతో కలిసి ఫంక్షన్ కు వెళ్లాడు. ఆ తర్వాత ఫంక్షన్ నుంచి గిరి ఒక్కడు మాత్రమే తిరిగొచ్చారు. అయితే అంతకు ముందే ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు రాజు, పూజ.. మరో నలుగురితో కలిసి పక్కా ప్లాన్ వేశారు. అదును కోసం వేచి చూశారు. ఈ క్రమంలో ఫంక్షన్ నుంచి గిరి ఒక్కరే రావడంతో.. అతని కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేశారు.

Nepali Gang s Daring Daylight Robbery in Secunderabad Owner s House Cleaned Out Police Clueless

అనంతరం రూ. 50 లక్షల విలువైన బంగారం, నగదును దోచుకుని.. అలాగే గిరి ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా లాక్కుని అక్కడినుంచి పరారయ్యారు. అయితే స్థానికుల సాయంతో గిరి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మూడు టీంలను రంగంలోకి దింపి వారికోసం గాలిస్తున్నారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ రమేష్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+