ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వేళ చిక్కుల్లో బండి సంజయ్ - ట్రోలింగ్..!!

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వేళ బండి సంజయ్ పైన ట్రోలింగ్ మొదలైంది. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడు అంతా నాటు నాటు జోష్ కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావటంతో అందరూ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి ఖండాతారాలకు చేరింది. ప్రధాని మొదలు పలువురు సినీ - రాజకీయ రంగ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీంను ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు సాధించింది. సినిమా దర్శకుడు రాజమౌళితో సహా టీంను అందరూ ప్రశంసిస్తున్నారు. ఆస్కార్ వేడుకల్లో పురస్కారాల వేదిక పైన ప్రతీ నోటా నాటు నాటు పాటే వినిపిస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైన ట్రోలింగ్ మొదలైంది. నాడు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేళ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు ట్రోల్ చేస్తున్నారు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నాడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు


ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సుదీర్ఘ కాలం సాగింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషించారు. సినిమా నిర్మాణం సమయంలో కొమురం భీం జ‌యంతి రోజు టీజ‌ర్‌ను విడుదల చేసారు. అందులో ఎన్టీఆర్ నెత్తిన టోపీతో కనిపించటం పైన విమర్శలు వినిపించాయి. ఇదే అంశం పైన నాడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నిజాం ర‌జాకార్ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన కొమురంభీంకు టోపీ పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాజ‌మౌళికి నిజంగా ద‌మ్ము, ధైర్య‌ముంటే నిజాం ర‌జాకార్ల‌కు బొట్లు పెట్టి సినిమా తీయాల‌న్నారు.

నేడు ఆర్ఆర్ఆర్ టీంకు ప్రశంసలు

ఆర్ఆర్ఆర్ సినిమాను ఎలా విడుద‌ల చేస్తారో చూస్తామ‌ని హెచ్చ‌రించారు. జాగ్ర‌త్త మీ ఆస్తుల‌ను కూడా ధ్వంసం చేస్తారు. అంతే కాకుండా బ‌రిష‌ల‌తో కొట్టి చంప‌డం కూడా ఖాయ‌మ‌ని ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. సినిమా విడుద‌ల కాకుండా అడ్డుకుంటామ‌ని, సినిమా రీళ్ల‌ను త‌గ‌ల‌బెట్ట‌డం కూడా ఖాయ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు రావటంతో బండి సంజయ్ అభినందించారు. ఒర్జినల్ పాట కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం చరిత్రాత్మకమని అభినందించారు.
సంజయ్ పై చర్యలు తీసుకుంటారా అంటూ..

సంజయ్ పై చర్యలు తీసుకుంటారా అంటూ..

ఆర్ఆర్ఆర్ టీం మొత్తానికి సంజయ్ అభినందనలు తెలిపారు. రాహుల్ స్లిప్ గంజ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు బండి సంజయ్ ట్వీట్ చేసారు. దీని పైన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. నాడు ఇదే సినిమాకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బండి సంజయ్ నాడు చేసిన ప్రసంగం..నేడు చేసిన ట్వీట్ ను జత చేస్తూ ప్రశ్నలు సంధిస్తున్నారు. క్షమాపణ చెబుతారా అని ప్రశ్నిస్తున్నారు. సంజయ్ మీద చర్చలు తీసుకుంటారా అంటూ ప్రధానిని ఉద్దేశించి ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీని పైన బండి సంజయ్ అండ్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+