బాధ్యతలు స్వీకరించిన అశోక్
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వేముల ఆశోక్ బిజెపి తెలంగాణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్సీ మోర్చా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లక్ష్మాణ్ మాట్లాడుతూ నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుకు తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు వక్రభాష్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కొన్ని పార్టీలు ఏకంగా ఈ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరికలు జారీచేయడం ఎవరి కోసమని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications