అదనపు కట్నం వేధింపులకు నవ వధువు ఆత్మహత్య.. ఎక్కడంటే?
పెళ్లి జరిగి ముచ్చటగా మూడు నాళ్ళు గడిచాయో లేదో నవ వధువు ఉరేసుకొని మరణించిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన కమలాపురం దేవిక పూణెలో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆమె వయస్సు ప్రస్తుతం 25 సంవత్సరాలు. ఈ క్రమంలోనే మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీశ్ చంద్ర ఆమెతో కలిసి అదే సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరువైపుల పెద్దలను ఒప్పించి గతేడాది ఆగస్టు 23న గోవాలో వివాహం చేసుకున్నారు.
ఇక వివాహం తర్వాత ప్రశాంతి హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు ఈ కొత్త జంట. అయితే పెళ్లి అయిన కొద్దిరోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దేవిక, సతీశ్ ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. మరునాడు కూడా తలుపులు తీయకపోవడంతో బద్దలుకొట్టి చూడగా, ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది.

స్థానికుల సమాచారంతో రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే దేవిక మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్నం కోసం శరత్ తమ కూతురు దేవికను వేధించేవాడని దేవికా తల్లి ఆరోపిస్తున్నారు. 5 లక్షల కట్నం 15 తులాల బంగారం ఇచ్చిన కూడా అదనపు కట్నం కోసం వేధించడంతో మానసికంగా కృంగిపోయి దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లువాపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications