కొత్త జిల్లాలతో తెలంగాణ పంట పండినట్లే! కేంద్రం నుంచి అదనపు నిధులు

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల పునర్విభజన మీద ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా..! కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో మాత్రం రాష్ట్రానికి అదనపు ప్రయోజనం చేకూరడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. జిల్లాల విభజనతో.. కేంద్రం అందిస్తోన్న వెనుకబడిన జిల్లాల నిధులు కూడా పెరిగే అవకాశముంది.

ప్రస్తుతం హైదరాబాద్ మినహా తెలంగాణలోని మిగతా 9 జిల్లాలను కేంద్రం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి వాటికోసం నిధులు విడుదల చేస్తోన్న సంగతి తెలుస్తోంది. ఏటా ఒక్కో వెనుకబడిన జిల్లా కోసం రూ.50కోట్లు విడుదల చేస్తోంది కేంద్రం.

'New districts' Extra benifits for telangana

ఇప్పుడు ఈ 9 జిల్లాలను మొత్తం 17 జిల్లాలుగా విభజించడంతో.. కేంద్రం అందించే వెనుకబడని జిల్లాల నిధులు.. ఇప్పటికే ఇస్తోన్న 450కోట్లతో పాటుగా అదనంగా మరో రూ.1,300 కోట్లకు పెరగే అవకాశముంది. కాగా, గత జిల్లాలతో పోలిస్తే.. కొత్త జిల్లాల విస్తీర్ణం, జనాభా తక్కువ కాబట్టి.. ఈ నిధులతో ఆయా జిల్లాలను అభివృద్ధి చేసుకోవడానికి వెసులుబాటు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+