నవదీప్, తరుణ్ ల పబ్ లలో కొత్త డ్రగ్! కోడ్ చెబితేనే సరఫరా?

హీరోలు నవదీప్, తరుణ్ లకు చెందిన పబ్ లలో సరికొత్త డ్రగ్ డ్రింక్ వినియోగంలో ఉందని సిట్ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్: హీరోలు నవదీప్, తరుణ్ లకు చెందిన పబ్ లలో సరికొత్త డ్రగ్ డ్రింక్ వినియోగంలో ఉందని సిట్ అధికారులు గుర్తించారు. నవదీప్ కు చెందిన బీపీఎం, తరుణ్ కు చెందిన ఆన్ పబ్ లలో మాత్రమే ఈ డ్రింక్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు, ఈ డ్రింక్ ను ఎవరికి పడితే వారికి ఇవ్వరని, దీని కోడ్ చెబితే మాత్రమే ఇస్తారని గుర్తించారు. ఈ డ్రింక్ తీసుకున్న 8 గంటల వరకు దాని మత్తు నుంచి బయటకు రావడం కష్టమట.

New Drug in Heros Navadeep, Tarun's Pubs! Will be issued after reveal the code?

దీనిని కెల్విన్ సహచరుడు జిషాన్ అలియాస్ జాక్ తయారు చేస్తాడని, ఈ డ్రింక్ ను నేరుగా డ్రగ్స్ కొనుగోలు చేయలేని వారి కోసం తయారు చేస్తారని సమాచారం. దీనిని 'జాక్ క్రాక్ డ్రింక్' గా పిలుస్తారట. ఈ విషయాన్ని సిట్ అధికారులకు డ్రగ్ సరఫరాదారు బ్రెండన్ వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఈవెంట్ మేనేజర్ గా బడాబాబుల ఈవెంట్ల ఏర్పాట్లను నవదీప్ నేరుగా చూసుకుంటాడని కూడా బ్రెండన్ తెలిపినట్టు సమాచారం. అంతే కాకుండా నవదీప్ ఈవెంట్ మేనేజర్ గా కొకైన్ ను సరఫరా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో సోమవారం నవదీప్ విచారణ మరింత కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+