రోడ్లపై మద్యం దుకాణాలు బంద్: కొత్త సీసాలో పాత సారాలా...

రహదారులపై మద్యం దుకాణాలు దూరంగా తరలించాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పుననుసరిస్తూ అక్టోబర్ 1నుండి నూతన మద్య విధానం

కరీంనగర్: రహదారులపై మద్యం దుకాణాలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.. వీటిని దూరంగా తరలించాలని.. కచ్చితంగా అమలు కావాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు ఒకటి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తోంది.. దుకాణాలు దక్కించుకొన్న వారు నిర్వహణకు సిద్ధమవుతున్నారు. 'కొత్త'సీసాలో పాత సారా అన్నట్లు మాయ చేయడానికి యత్నిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట తొమ్మిది, కామారెడ్డి జిల్లాలో 11 మద్యం దుకాణాలు ఉన్నాయి. రహదారులపై మద్యం అందుబాటులో ఉంటే వాహన చోదకులకు సులువుగా దొరుకుతుంది. తాగి ప్రమాదాలకు కారణమవుతున్నారు.దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు గతంలో కొరడా ఝళిపించింది.

ఈ ఏడాది ప్రథమార్థంలోనే రహదారులకు దూరంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దుకాణ అనుమతుల గడువు సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఉన్నఫళంగా రహదారుల వద్ద నుంచి తరలిస్తే నష్టం వాటిల్లుతుందని యజమానులు ఆబ్కారీశాఖతో మొరపెట్టుకొన్నారు.

అధికారుల అభ్యర్థన మేరకు ఉత్తర్వులను సవరించి, అక్టోబరు ఒకటి నుంచి కొత్తగా ఏర్పాటు కానున్న దుకాణాల విషయంలో షరతు అమలు చేసేలా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం కొత్త అనుమతులను లాటరీ పద్ధతిన ఔత్సాహికులకు కట్టబెట్టింది. పాత దుకాణాలకు ఈ నెలాఖరుతో గడువు.

మద్యం దుకాణాలు రహదారులకు దూరంగా ఉండాల్సిందే

మద్యం దుకాణాలు రహదారులకు దూరంగా ఉండాల్సిందే

అక్టోబరు ఒకటి నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారులకు కచ్చితంగా 220 మీటర్ల దూరంలో ఉండాలి. వీటి వెంబడి ఉన్న దుకాణాల అనుమతులు పొందిన వారిని ఆబ్కారీ అధికారులు పిలిపించి పాత దుకాణాలు ఉన్న ప్రాంతంలో విక్రయాలు చేయరాదని కరాకండిగా చెప్పారు. ఒకటో తేదీ లోపు కొత్త దుకాణాలు అందుబాటులోకి తీసుకొచ్చి విక్రయాలు చేసుకోవాలని ఆదేశించారు. దుకాణాల ఏర్పాటు ఆలస్యమైతే కనీసం తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని అమ్మకాలు సాగించాలని సూచించారు.

మడిగెల కోసం వేట

మడిగెల కోసం వేట

జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మద్యం విక్రయాలు భారీస్థాయిలో కొనసాగి, తమకు లాభాల పంట పండుతుందని భావించి ఔత్సాహికులు దరఖాస్తులు భారీగానే వేశారు. కొన్నిచోట్ల సిండికేట్‌గా మారడంతో తక్కువ దరఖాస్తులు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 220 మీటర్ల తర్వాత దుకాణాలు ఏర్పాటు చేసుకున్నా విక్రయాలు తగ్గవని భావించి పలువురు పోటీపడ్డారు. మద్యం దుకాణం ఉన్నట్లు తెలిపేలా బోర్డులు, హోర్డింగులు పెడితే మద్యం కావల్సిన వారు వాహనాలు పక్కకు ఆపి వస్తారని వీరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండురోజుల్లో కొత్త మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి.

20 దుకాణాలు రహదారుల వెంటనే

20 దుకాణాలు రహదారుల వెంటనే

ఉమ్మడి జిల్లాల్లో 20 మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉండగా ఇప్పటికీ రెండు, మూడు దుకాణాలు మినహా మిగతావారు 220 మీటర్ల తర్వాత దుకాణాలను ఏర్పాటు చేసుకోలేదు. జక్రాన్‌పల్లిలో మార్కెట్టు వద్ద ఒకటి, రెండు మద్యం దుకాణాల యజమానులు కలిసి పక్కపక్కనే గదులను అద్దెకు తీసుకొన్నారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌లలో రహదారికి దూరంగా అద్దె భవనాలు తీసుకొన్నారు. మిగతా దుకాణాల యజమానులు స్థల పరిశీలన చేయడం, పరిసర ప్రాంతాల్లో అద్దె భవనాలు కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

మాణిక్‌భండార్‌లో దుకాణ నిర్మాణం కొనసాగుతోంది.

మాణిక్‌భండార్‌లో దుకాణ నిర్మాణం కొనసాగుతోంది.

వర్ని మండల చౌరస్తాలో స్థలాన్ని ఎంపిక చేసుకొని దుకాణ నిర్మాణానికి నమూనా సిద్ధం చేసుకున్నారు. ఒకటో తేదీ నుంచి రహదారులకు దూరంగా నాలుగైదు దుకాణాలు మినహా నిర్ధారిత ప్రాంతంలో మద్యం విక్రయాలు సాగించే పరిస్థితి లేదని ఆబ్కారీ అధికారులే స్వయంగా చెబుతున్న మాట. సర్దుబాటు చేసుకోండి.. చూసీచూడనట్లు వ్యవహరిస్తాం..

ఆబ్కారీ సిబ్బంది మాత్రం 10, 15 రోజుల్లో 220 మీటర్ల తర్వాత దుకాణాలు ఏర్పాటు చేసుకున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తామని దుకాణ యజమానులకు లోపాయికారీగా చెబుతున్నట్లు తెలిసింది. వీరిస్తున్న భరోసా మద్యం వ్యాపారులకు వూరటనిస్తోంది. వీరు స్థలాల ఎంపిక చేసుకొని దుకాణ నిర్మాణం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు అద్దె గదుల కోసం వేట సాగిస్తున్నారు.

చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు...

చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు...

ఆబ్కారీ ఉప కమిషనరు డేవిడ్‌ రవికాంత్‌ మాట్లాడుతూ అక్టోబరు ఒకటి నుంచి కొత్త మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరం తర్వాత ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. గుడారాలు వేసుకొంటారో, షామియానాలు ఏర్పాటు చేసుకొని అమ్మకాలు సాగిస్తారో తమకు సంబంధం లేదన్నారు. 10, 15 రోజుల గడువు ఇచ్చి చూసీచూడనట్లు వ్యవహరిస్తామని చెబుతున్న ఆబ్కారీ సిబ్బందిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

ఇలా దరఖాస్తులు...

జిల్లా : నిజామాబాద్‌
జాతీయ రహదారులపై వచ్చిన దుకాణాలు దరఖాస్తులు
ఇందల్వాయి 65
మాణిక్‌భండార్‌ 15
కమ్మర్‌పల్లి 15
సుద్దపల్లి 3
జక్రాన్‌పల్లి-1 20
జక్రాన్‌పల్లి-2 19
రాష్ట్ర రహదారులపై వచ్చిన
దుకాణాలు దరఖాస్తులు
వర్ని 11
రుద్రూరు 5
సాలూర 9

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+