పెళ్ళైన నెలకే ఆత్మహత్య చేసుకొన్న కొత్త పెళ్ళికొడుకు, ఎందుకంటే?

హైదరాబాద్: పెళ్ళి కోసం చేసిన అప్పులు తీర్చలేక కొత్త పెళ్ళి కొడుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైద్రాబాద్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. కంచన్‌బాగ్ డివిజన్‌లోని గులాం ముస్తఫానగర్‌కు చెందిన జలాలుద్దీన్ బుక్ బైండర్‌గా పనిచేస్తున్నాడు.

2018 మార్చిలో జలాలుద్దీన్ వివాహం చేసుకొన్నాడు పెళ్ళి చేసుకొనేందుకు ఆయన అప్పులు చేశారు. ఈ అప్పులను తీర్చేందుకు ఆయన చాలా ఇబ్బందులను పడ్డాడు. అయితే పెళ్ళి సమయంలో వంటలు చేసిన వ్యక్తికి సుమారు రూ.20 వేలను జలాలుద్దీన్ చెల్లించాల్సి ఉంది. అయితే ఈ విషయమై జలాలుద్దీన్ ఇంటికి వంటవాడు ప్రతి రోజూ వచ్చివెళ్ళేవాడు.

New groom suicide in Hyderabad

అయితే ఈ అప్పును తీర్చేందుకు జలాలుద్దీన్ వద్ద డబ్బులు లేవు. సోమవారం నాడు కూడ వంటవాడు జలాలుద్దీన్ ఇంటికి వచ్చాడు. అయితే వంటవాడు జలాలుద్దీన్‌కు ఫోన్ చేశాడు. ఇంట్లోనే ఉన్న జలాలుద్దీన్ తాను హయత్‌నగర్‌లో ఉన్నానని చెప్పాడు. అయితే హయత్‌నగర్ నుండి జలాలుద్దీన్ వచ్చే వరకు తాను అక్కడే ఉంటానని వంటవాడు తెగేసి చెప్పాడు.

దీంతో భయంతో జలాలుద్దీన్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. జలాలుద్దీన్ ఫ్యాన్‌కు ఉరేసుకొన్న విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జలాలుద్దీన్ మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+