Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NH-365BG: హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే వారికి ఇక పండగే! 56 కి.మీ దూరం తగ్గనుంది

తెలుగు రాష్ట్రాల రవాణా ముఖచిత్రాన్ని మార్చేస్తూ, ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి 'యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్' హైవే ప్రారంభానికి సిద్ధమైంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా, విదేశీ తరహా అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఈ రహదారిని తీర్చిదిద్దారు. పర్యావరణ హితంగా, భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు మే నెలలో సామాన్యులకు అందుబాటులోకి రానుంది

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా సుమారు 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, ఎన్‌హెచ్‌-365బీజీగా పిలిచే ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే, ఆ దూరం 56 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ఏలూరు జిల్లా మీదుగా దేవరపల్లి వరకు 162.04 కి.మీ పొడవునా నిర్మించిన ఈ రహదారి వల్ల ప్రయాణ సమయం ఆదా కావడమే కాకుండా ఇంధన ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.

New NH-365BG Smart Highway With Solar Lights and ATMS Technology to Cut Hyderabad-Vizag Travel Time by 56 KM

యాక్సెస్ కంట్రోల్డ్: హైవేపై పూర్తి నియంత్రణ

ఈ రహదారి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 'యాక్సెస్ కంట్రోల్డ్' పద్ధతిలో పనిచేస్తుంది. అంటే సాదాసీదా రోడ్లలాగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు లోపలికి రావడానికి లేదా బయటకు వెళ్లడానికి వీలుండదు. మొత్తం 162 కిలోమీటర్ల పరిధిలో కేవలం 9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల వేగంగా వెళ్లే వాహనాలకు అడ్డంకులు ఉండవు మరియు ప్రమాదాల ముప్పు తక్కువగా ఉంటుంది. అలాగే, వాహనదారులు ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు చేసే అత్యాధునిక వ్యవస్థను ఇక్కడ అమలు చేస్తున్నారు.

టెక్నాలజీతో నిఘా: ఏటీఎంఎస్‌ (ATMS)

భద్రత విషయంలో ఈ హైవే సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS) ద్వారా ఈ రోడ్డుపై నిరంతర నిఘా ఉంటుంది.

  • 360 డిగ్రీల సీసీ కెమెరాలు: ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక కెమెరాను అమర్చారు. ఇది రోడ్డుకు రెండు వైపులా కిలోమీటరు మేర దృశ్యాలను రికార్డు చేస్తుంది.
  • నిబంధనల అమలు: అతివేగం, సీటు బెల్టు లేకపోవడం, రాంగ్ రూట్ ప్రయాణం వంటి ఉల్లంఘనలు జరిగితే కెమెరాలు వెంటనే గుర్తించి ఏటీఎంఎస్‌కు సమాచారం అందిస్తాయి. వెంటనే బాధ్యులకు ఈ-చలాన్లు అందుతాయి.
  • క్యూఆర్ కోడ్ సదుపాయం: రహదారి పొడవునా ఉండే క్యూఆర్ కోడ్ బోర్డులను స్కాన్ చేయడం ద్వారా దగ్గర్లోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్, ఆస్పత్రుల వివరాలను తెలుసుకోవచ్చు.

పర్యావరణ హితం, మౌలిక వసతులు

కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 4,451.87 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో పర్యావరణానికి పెద్దపీట వేశారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రోడ్డు నిర్మాణంలో రామగుండం ఎన్టీపీసీ నుంచి సేకరించిన ఫ్లైయాష్‌ను వినియోగించారు. రహదారి పొడవునా సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు, ఇవి పగలు బ్యాటరీలను ఛార్జ్ చేసుకుని రాత్రివేళ ఆటోమేటిక్ గా వెలుగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 50 కిలోమీటర్లకు ఒకచోట హోటళ్లు, వాష్‌రూమ్స్ మరియు విశ్రాంతి గదులతో కూడిన సముదాయాలను నిర్మిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవేల శకానికి ఖమ్మం-దేవరపల్లి రహదారి నాంది పలుకుతోంది. నాగ్‌పుర్-అమరావతి హైవేకి అనుసంధానం కావడంతో పాటు, వాణిజ్యపరంగా కూడా ఈ రోడ్డు కీలకం కానుంది. కేవలం ప్రయాణ సౌకర్యమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ 'స్మార్ట్ హైవే' మే నెలలో పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+