పెద్ద పార్టీలకి 'కొత్త' షాక్, జనసేనపై కన్నేశారు: బాబుకు కృష్ణయ్య చేయి!

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస, బిజెపి, మజ్లిస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు ఓ కొత్త వేదిక తెరపైకి వస్తోంది. 'వన్ హైదరాబాద్ ఫర్ క్లీన్ పాలిటిక్స్' అంటూ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని చిన్న చిన్న పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

లోక్‌సత్తా, సిపిఐ, సిపిఎం, మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి చిన్న పార్టీలు కలిసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని తెలుస్తోంది. వీరి ఎన్నికల నినాదం.. 'అవినీతి పైన యుద్ధం'. సామాజిక సమానత్వం కోసం మరికొన్ని సంఘాలు కూడా వీరితో చేతులు కలుపుతున్నాయి.

New rainbow alliance for GHMC polls on the horizon

పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నించారా?

సమాచారం మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను కూడా తమలో కలుపుకోవాలని వారు భావించినట్లుగా తెలుస్తోంది. అయితే, జనసేన పార్టీ నిర్ధారణ చేయాల్సి ఉందట. జనసేన.. టిడిపి-బిజెపికే మద్దతు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

తాము ఈ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు కలుస్తున్నామని, సోకాల్డ్ ముఖ్య పార్టీలు అన్ని కూడా అవినీతిలో కూరుకుపోయాయని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. త్వరలో తమ పార్టీలన్నీ కలిసి హైదరాబాదులో ఓ భారీ సమావేశం నిర్వహిస్తామని లోక్‌సత్తా అధ్యక్షులు పాండురంగారావు చెప్పారు.

ఆసక్తికరమైన విషయమేమంటే టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఈ కొత్త కూటమితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బిసిల కోసం పని చేసే దేనికైనా తాను మద్దతిస్తానని ఆర్ కృష్ణయ్య చెబుతున్నారు.

సిపిఎం నేత వీరభద్రం, లోక్‌సత్తా నేత పాండురంగా రావులు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపించారని తెలుస్తోంది. సమాచారం మేరకు... పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+