కేబీఆర్ ఫైరింగ్ కేసులో కొత్త ట్విస్ట్: మరో క్లూ దొరికింది
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో కొత్త మలుపు! పార్క్ వద్ద కాల్పుల ఘటనలో ఓబులేష్‌కు ఎలాంటి సంబంధం లేదని, మీడియాలో అతని ఫోటోలు వస్తున్నాయని కానిస్టేబుల్ ఓబులేష్ కుటుంబ సభ్యులు డీజీపీ కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
గురువారం మధ్యాహ్నం ఓబులేసు కుటుంబ సభ్యులు వచ్చి మీడియాలో తప్పుడు ఫోటోలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో ఓబులేష్‌కుసంబంధం లేదని చెప్పారు. తనకు ఏం తెలియదని చెప్పారని సమాచారం. కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడి అరెస్టును పోలీసులు ఇప్పటి వరకు ధ్రవీకరించని విషయం తెలిసిందే. దర్యాఫ్తు కొనసాగుతుందని చెబుతున్నారు.

కాగా, బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ వద్ద కారులోకి ఎక్కిన నిత్యానంద రెడ్డితో పాటు అగంతకుడు ఎక్కి అతనిని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పెనుగాలట, కాల్పులు జరిగాయి. నిత్యానంద సోదరుడు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతను పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
దుండగుడు చాలా ఆధారాలను కారులోనే వదిలేశాడు. అవి తాను కిడ్నాప్ కోసం వాడిన ఏకే 47 రైఫిల్, కొత్తగా కొనుకున్న ఒక కొత్త జీన్స్ ప్యాంట్, దాని తాలూకు బిల్లు అక్కడే వదిలాడు. అలాగే పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. దానిని బట్టి ఊహాచిత్రం విడుదల చేశారు. అయితే, పోలీసులు నిందితుడిని ఓబులేష్‌గా గుర్తించారని, అతనిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఓబులేష్ కుటుంబ సభ్యులు వచ్చి తమ ఫోటోలు వస్తున్నాయని చెప్పడం గమనార్హం.
మరో క్లూ..!
నిత్యానంద రెడ్డి కాల్పుల్లో మరో క్లూ లభ్యమైంది. కాల్పుల అనంతరం నిందితుడు ఓబులేష్ పరుగెడుతుండగా పక్కనున్న భవంతిలో ఉన్న సీసీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రికార్డైన కెమెరాలో అతని కాళ్లు కనిపించాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications