చచ్చేదాకా కలిసుంటాం, అంతా తల్లిదండ్రుల వల్లే!: మధుప్రియ కేసులో ట్విస్ట్
హైదరాబాద్: సింగర్ మధుప్రియ, భర్త శ్రీకాంత్‌కు పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ ఫలితాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. బతికున్నంత కాలం తాము కలిసే జీవిస్తామని మధుప్రియ, శ్రీకాంత్‌లు సోమవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
తన తల్లిదండ్రుల వల్లే ఇంత పెద్ద గొడవ జరిగిందని మధుప్రియ చెప్పారని తెలుస్తోంది. తన తల్లిదండ్రులతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు శ్రీకాంత్ గురించి తనకు నూరిపోశారని చెప్పారని తెలుస్తోంది. దీంతో, తాను అయోమయ పరిస్థితిలో పడ్డానని చెప్పారు.
పోలీసుల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్ అనంతరం వాస్తవ విషయాలు బోధపడ్డాయన్నారు. తన జీవితంలో శ్రీకాంత్‌కు తప్ప మరొకరికి స్థానం లేదని ఆమె పేర్కొన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ... మధుప్రియ తల్లిదండ్రులు తనను నమ్మించి తనపై దాడి చేశారన్నాడు. మధుప్రియ తల్లిదండ్రుల కారణంగానే ఇంత పెద్ద గొడవ జరిగిందన్నాడు. మధుప్రియతోనే కలిసి ఉంటానని చెప్పాడు. మరో రెండు దెబ్బలు గట్టిగా తగిలితే తాను చచ్చిపోయేవాడినని శ్రీకాంత్ చెప్పాడు.
పెళ్లయినప్పటి నుంచి తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని, తనను వాళ్ల కుటుంబ సభ్యుడనేలా నమ్మించారని, తనపై దాడి చేసేందుకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని మధుప్రియ తల్లిదండ్రులు ఎదురు చూశారని శ్రీకాంత్ ఆరోపించాడు.
కాగా, తన భర్త వేధిస్తున్నాడంటూ హుమాయూన్ పోలీస్ స్టేషన్లో మధుప్రియ శనివారం రాత్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి హైడ్రామా నడిచింది. అనంతరం ఆదివారం సాయంత్రం పోలీసులు వీరికి కౌన్సెలింగ్ ఇప్పించిన విషయం తెలిసిందే.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications