తెలంగాణలోని మందు బాబులకు గుడ్ న్యూస్

న్యూ ఇయర్ వేళ తెలంగాణలోని మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31న బార్లకు, క్లబ్‌ లకు, ఈవెంట్‌ లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. అలాగే వైన్‌ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చింది. మరోవైపు ఈ నెల 30, 31న ప్రత్యేక తనిఖీలు ఉంటాయని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ శాఖ స్పష్టం చేసింది.

నూతన సంవత్సరం నేపథ్యంలో తెలంగాణలోని మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ మేరకు కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. డిసెంబర్ 31 న బార్లు, క్లబ్ లు, ఈవెంట్ లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకూ అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. దాంతోపాటు వైన్‌ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎక్సైజ్, నార్కోటిక్స్, పోలీసుల ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్స్‌ లో తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్‌ వేడుకలను నిర్వహించుకోవాలని.. నిబంధనలు అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

New Year Cheer Telangana Allows Bars Clubs amp amp Events Till 1 AM on Dec 31

ఇక న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యంగా.. ప్రమాదాలను నివారించేందుకు డిసెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు నగరవ్యాప్తంగా 'స్పెషల్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డ్రైవ్' ను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ ను ఏమాత్రం సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+