తెలంగాణ కరోనా టెస్టుల్లో దూకుడు: 20 లక్షల మార్క్ దాటి: అదే రేంజ్‌లో కొత్త కేసులూ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే వస్తున్నాయి. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వైరస్ టెస్టింగులకు అనుగుణంగా రోజువారీ కేసుల సంఖ్యలో మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. ఎప్పట్లాగే- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో వైరస్ కేసుల తీవ్రతా కొనసాగుతోంది. కరోనా రోజువారీ పరీక్షల్లో ప్రభుత్వం కొత్త మార్క్‌ను అందుకుంది. కరోనా టెస్టింగులు 20 లక్షలను దాటేశాయి.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2426 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13 మంది మరణించారు. 2324 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,52,602కు చేరుకుంది. ఇందులో 1,19,467 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 940కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,195గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 25,240 మంది చికిత్స పొందుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 338 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకు రికార్డయిన కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే. ఆదిలాబాద్-25, భద్రాద్రి కొత్తగూడెం-67, జగిత్యాల-62, జనగామ-33, జయశంకర్ భూపాలపల్లి-22, జోగుళాంబ గద్వాల-32, కామారెడ్డి-54, కరీంనగర్-129, ఖమ్మం-98, కొమరంభీమ్ ఆసిఫాబాద్-15, మహబూబ్ నగర్-46, మహబూబాబాద్-76, మంచిర్యాల-57, మెదక్-42, మేడ్చల్ మల్కాజ్‌గిరి-172, ములుగు-16, నాగర్ కర్నూలు-50, నల్లగొండ-164, నారాయణపేట్-14, నిర్మల్-32, నిజామాబాద్-89, పెద్దపల్లి-56, రాజన్న సిరిసిల్ల-41, రంగారెడ్డి-216, సంగారెడ్డి-97, సిద్ధిపేట్-87, సూర్యాపేట్-78, వికారాబాాద్-11, వనపర్తి-38, వరంగల్ రూరల్-18, వరంగల్ అర్బన్-108, యాదాద్రి భువనగిరి-43 కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వైరస్ పరీక్షల జోరు కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 60 వేలకు తగ్గకుండా రోజువారీ టెస్టులను నిర్వహిస్తోంది. మరోసారి 60 వేల వరకు టెస్టులను నిర్వహించింది. కొత్తగా వ్యాప్తంగా 62,890 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 20,16,461కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 54,313 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications