తెలంగాణలో లక్షన్నర మార్క్: వెల్లువలా వైరస్: టెస్టింగుల్లో సర్కార్ దూకుడు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోనే ఉంది. కరోనా వెల్లువ కొనసాగుతూనే వస్తోంది. రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతూనే ఉంది. గంటగంటకూ కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య లక్షన్నర మార్క్‌ను దాటేసింది. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. మరోవంక- తెలంగాణ ప్రభుత్వం రోజువారీ టెస్టింగుల సంఖ్యను మరింత పెంచింది. 24 గంటల వ్యవధిలో 63 వేలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించింది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2534 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 2071 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరుకుంది. ఇందులో 1,17,143 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 927కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,106గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 25,066 మంది చికిత్స పొందుతున్నారు.

Newly 2534 Covid19 positive cases and 11 deaths reported in Telangana last 24 hours

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 327 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. ఆదిలాబాద్-23, భద్రాద్రి కొత్తగూడెం-81, జగిత్యాల-65, జనగామ-41, జయశంకర్ భూపాలపల్లి-24, జోగుళాంబ గద్వాల-29, కామారెడ్డి-123, కరీంనగర్-107, ఖమ్మం-109, కొమరంభీమ్ ఆసిఫాబాద్-30, మహబూబ్ నగర్-38, మహబూబాబాద్-73, మంచిర్యాల-64, మెదక్-42, మేడ్చల్ మల్కాజ్‌గిరి-132, ములుగు-16, నాగర్ కర్నూలు-62, నల్లగొండ-149, నారాయణపేట్-16, నిర్మల్-25, నిజామాబాద్-90, పెద్దపల్లి-58, రాజన్న సిరిసిల్ల-47, రంగారెడ్డి-195, సంగారెడ్డి-96, సిద్ధిపేట్-103, సూర్యాపేట్-83, వికారాబాాద్-22, వనపర్తి-42, వరంగల్ రూరల్-41, వరంగల్ అర్బన్-124, యాదాద్రి భువనగిరి-57 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    Telangana New Revenue Act 2020 : తెలంగాణా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, రెవెన్యూ కోర్టులు రద్దు !

    కరోనా వైరస్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోసారి 60 వేల వరకు టెస్టులను నిర్వహించారు. కొత్తగా వ్యాప్తంగా 63,017 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 19,53,571కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 52,619 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+