Kodandaram: సెక్యూరిటీ వద్దని చెప్పేసిన ఎమ్మెల్సీ కోదండ రామ్-కారణమిదేనట..!
తెలంగాణలో కొత్తగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరామ్ తనకు ఇచ్చిన భద్రతను నిరాకరించారు. ఎమ్మెల్సీలకు ఇచ్చే సాధారణ భద్రత కూడా తనకు వద్దని తేల్చిచెప్పేశారు.
ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్ లను తిప్పిపంపేశారు. దీంతో కోదండరామ్ నిర్ణయం వెనుక ఉన్న కారణంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అయితే ఆయనే స్వయంగా దీని వెనుక ఉన్న కారణం వెల్లడించారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ ఆ వెంటనే తనకు పంపిన గన్ మెన్లను వెనక్కి పంపేశారు. తాను ప్రజల మనిషిని అని, కాబట్టి వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. తనకు గన్ మెన్ల భద్రత ఉంటే ప్రజలతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే భద్రతను నిరాకరించినట్లు తెలిపారు.
భద్రత లేకపోతేనే ప్రజలు తన వద్దకు స్వేచ్ఛగా వచ్చి సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ కోదండరామ్ తెలిపారు. సెక్యూరిటీ ఉంటే ప్రజలు స్వేచ్ఛగా తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం ఉంటుందన్నారు. కాబట్టి తనకు భద్రత వద్దన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కోదండరామ్ ఎలాంటి భద్రత లేకుండానే రాత్రీ పగలూ నిరసనల్లో పాల్గొనేవారు. రాష్ట్రవ్యాప్తంగా అలాగే తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యేవారు. ఇప్పుడూ అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications