ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్ళిచేసుకొన్నారు, ఆర్నెళ్ళ తర్వాత ఏమైందంటే
ప్రేమించి పెళ్ళిచేసుకొని ఆరుమాసాలకే ఆత్మహత్యచేసుకొన్నారు. వారి మరణానికి కారణాలు తెలియదు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకొన్న తర్వాత కూడ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై అర్థం కావడం లేదని గ్రామస్థులు
డిచ్ పల్లి : ప్రేమించారు, పెళ్ళి చేసుకొన్నారు. వివాహం చేసుకొని ఆరు మాసాలు కూడ గడవలేదు. కుటుంబ కలహల నేపథ్యంలో ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో చోటుచేసుకొంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది.
ఒకరినొకరు ప్రేమించుకొన్నారు. వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు, అయితే పెద్దలను ఎదిరించి వివాహం చేసుకొన్నారు. అదే గ్రామంలో వేరు కాపురం పెట్టారు. కొంత కాలం బాగానే ఉన్నారు. భార్య భర్తల మద్య ఇటీవల కాలంలో గొడవలు ప్రారంభమయ్యాయి.ఈ గొడవలు వారిద్దరి ఆత్మహత్యకు దారితీశాయి.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని అమృతాపూర్ కు చెందిన గంగారాం, అదే గ్రామానికి చెందిన రోజ ను ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. గంగారాం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదు. అయితే పెద్దలను ఎదిరించి వారిద్దరూ ఆరుమాసాల క్రితం పెళ్ళి చేసుకొని అదే గ్రామంలో కాపురం పెట్టారు.
ఏం జరిగిందో తెలియదు ఇటీవల కాలంలో భార్య,భర్తల మద్య గొడవలు తీవ్రంగా జరుగుతుండేవి. ఈ గొడవలు తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి కూడ భార్య భర్తల మద్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకొంది. ఈ వాగ్వాదంతో భార్యభర్తలు ఇద్దరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే సోమవారం ఉదయం చెరువు కట్ట మీద నుండి వెళ్తున్న గ్రామస్థులు గంగారాం మృతదేహం చెరువులో తేలి ఉండడాన్ని గమనించి చెరువులో గాలిస్తే రోజ మృతదేహం కూడ దొరికింది. వీరి మరణానికి కారణాలు తెలియాల్లి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications