Exit poll news 18: బీజేపీదే ఆధిక్యం, రన్నరప్‌గా కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?

దేశంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం 6 గంటలతో ముగియడంతో పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దేశంలో ఎన్డీఏదే మరోసారి అధికారం అని మెజార్టీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీకి గతం కంటే కొంత సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

తెలంగాణా లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీకి 7-10 సీట్లు, దాదాపు 37% ఓట్ల వాటాను అంచనా వేసింది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌కు దాదాపు 34% ఓట్లతో 5-8 సీట్లు రావచ్చు.

news 18 exit poll BJP will 7-10 Seats in Telangana 5-8 seats for congress

భారత్ రాష్ట్ర సమితి (బీర్‌ఎస్), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)తో సహా ఇతరులు 3-5 సీట్లు సాధించవచ్చని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్‌కి 21%, ఏఐఎంఐఎంకి 3% ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

తెలంగాణలో ఆరా సర్వే ఎగ్జిట్ పోల్స్

ఆరా సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని పేర్కొంది. తెలంగాణలో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని తేల్చేసింది. ఇక, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ తర్వాత స్థానంలో ఉంది.

బీజేపీకి 8 నుంచి 9 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 సీట్లు
ఎంఐఎం పార్టీకి ఒక్క స్థానం

అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే పేర్కొనడం గమనార్హం. దీంతో తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి నిరాశ కలిగించేలా ఉన్నాయి. ఏది ఏమైనా జూన్ 4న విడుదలయ్యే అసలైన ఫలితాల కోసం వేచిచూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+