వచ్చే 72 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు, బలమైన ఈదురుగాలులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం వెల్లడించింది. నైరుతి దిశ నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, చాలా చోట్ల నుంచి అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.
దక్షిణ బంగళాఖాతంలో కొంత భాగం, నికోబార్ ద్వీపం, దక్షిణ అండమాన్ సముద్రము మొత్తం, ఉత్తర అండమాన్ సముద్రంలో కొంత భాగాంలోకి నైరుతి రుతపవనాలు శుక్రవారం ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో సుమారుగా మే 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా - పశ్చిమ బెంగాల్ తీరానికి మే 26వ తేదీ ఉదయం చేరుకొనే అవకాశం ఉంది.
శుక్రవారం ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణా రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి వీస్తూన్నాయి. రాగల 72 గంటల్లో తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
Recommended Video
శుక్వరారం ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులు(గాలి వేగం గంటకి 30 నుంచి 40కి. మీ)తో కూడిన వర్షం(ముఖ్యంగా ఆగ్నేయ,దక్షిణ తెలంగాణా జిల్లాలలో), శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. ఆదివారం కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications