తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. వాగులు, వంకల సమీపంలో ఉన్న ప్రాంతాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

శనివారంనాడు నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 22న ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, సిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

next three days heavy rain in Telangana Yellow alert to these district

సెప్టెంబర్ 23న ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

హైదరాబాద్ రాత్రి వరకు దంచికొట్టిన వాన

గ్రేటర్ హైద‌రాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలో అత్యధికంగా 7.43 సెం.మీ., చిలుకానగర్‌లో 6.60 సెం.మీ., గన్‌ఫౌండ్రిలో 6.58 సెం.మీ., నాంపల్లిలో 6.48 సెం.మీ., నాచారం, బేగంబజార్‌లో 5.98 సెం.మీ., జవహర్‌నగర్‌, ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో 5.80 సెం.మీ., ఖైరతాబాద్‌లో 5.55 సెం.మీ., హిమాయత్‌నగర్‌ విఠల్‌వాడిలో 5.53 సెం.మీ మేర వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ అధికారులు వెల్లడించారు.

కాగా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ నగరంలో ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.2 డిగ్రీలు, గాలిలో తేమ 68 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో దాని ప్రభావం వల్ల రాగల రెండు మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+