హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ విధ్వంసానికి కుట్ర: ఐసిస్ చీఫ్‌తో మీసేవ నుంచి మంతనాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాతబస్తీలోని మూడు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు బృందం) అధికారులు మంగళవారం నాడు సోదాలు నిర్వహించారు. కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు హబీబ్, ఇబ్రహీంలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తలాబ్‌కట్ట, బార్కాస్, చాంద్రాయణగుట్టు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

హైద్రాబాద్‌పై ఐసిస్: 'వీరి వెనుక ఎవరో తెలియాలి', కిచెన్‌లో బాంబులు దాచారు హైద్రాబాద్‌పై ఐసిస్: 'వీరి వెనుక ఎవరో తెలియాలి', కిచెన్‌లో బాంబులు దాచారు

ఈ తనిఖీల్లో 17బుల్లెట్లు, 2కంప్యూటర్లు, 2స్కానర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఐసిస్ చీఫ్ అబూ అల్ బాగ్దాదీతో నాలుగు నెలల్లోనే నాలుగుసార్లు మాట్లాడినట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వారు మీసేవ కేంద్రం నుంచి ఐసిస్ చీఫ్‌తో మాట్లాడారు. హైదరాబాదులో విధ్వంసం సృష్టించడమే వీరి లక్ష్యంగా ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.

ఉగ్ర నిధుల కోసం భార్య నగలమ్మిన హైదరాబాద్ ఐసిస్ ఉగ్రవాది ఉగ్ర నిధుల కోసం భార్య నగలమ్మిన హైదరాబాద్ ఐసిస్ ఉగ్రవాది

NIA conducts raids in Hyderabad's old city

ఇబ్రహీం పేరును అబ్దుల్ రహాన్‌గా మార్చి కమ్యూనికేషన్ బాధ్యతలు అప్పగించారని, ఇలియాస్ పేరును అబూ మన్సూర్‌గా మార్చి మతపరమైన బాధ్యతలు అప్పగించారని, హబీబ్ పేరును అబూ షాహిబాగా మార్చి ఆయుధాల బాధ్యతను అప్పగించారని, ఫహాద్ పేరు అబూ హలీమాగ మార్చి రిక్రూట్మెంట్ బాధ్యతలు అప్పగించారని, రిజ్వాన్ పేరును అబూహసన్‌గా మార్చి బ్యాంకు ఖాతాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారని ఎన్ఏఐ అధికారులు గుర్తించారు.

English summary
NIA conducts raids in Hyderabad's old city on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X