వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: షాద్‌నగర్లో ఉగ్రవాదులు కాదు... నయీం హతం, ఎవరితను? (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో గ్యాంగ్ స్టర్ నయీం సోమవారం ఉదయం హతమైనట్లుగా తెలుస్తోంది. నయీం నల్గొండ జిల్లా భువనగిరివాసి. అతని పైన వందకు పైగా కేసులు ఉన్నాయి. 20 హత్య కేసులు ఉన్నాయి. సంఘటన స్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

నయీం పలు హత్య కేసుల్లో నిందితుడు. సోహ్రబుద్దీన్ కేసులో సీబీఐ నయీం కోసం వెతుకుతోంది. ఐపీఎస్ వ్యాస్, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మాజ మావోయిస్టులు సాంబశివుడు, రాములు, పౌర హక్కుల నేత పురుషోత్తం తదితరుల హత్య కేసుల్లో నయీం నిందితుడు. ఈ కాల్పుల్లో నయీంతో పాటు అతని అనుచరుడు కూడా చనిపోయాడు.

తొలుత ఉగ్రవాదులుగా వార్తలు...

షాద్ నగర్‌లో ఐసిస్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లుగా తొలుత పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పోలీసుల హడావుడి, ఇంటిని చుట్టుముట్టడాన్ని చూసి.. అది ఉగ్రవాదుల కోసం జరుగుతున్న వేటగా అందరూ భావించారు.

షాద్ నగర్లోని మిలీనియం టౌన్‌షిప్‌లోని ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలుస్తోందని, ఎన్ఐఏ అధికారులు ఇంటిని చుట్టుముట్టారని, కాల్పులలో ఇంట్లోని ఉగ్రవాది ఒకరు చనిపోయారని, కాల్పులు ఆగిపోయాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే, మిలీనియం టౌన్ షిప్‌లో తలదాచుకుంది, కాల్పుల్లో మృతి చెందింది గ్యాంగ్ స్టర్ నయీం అని తేలిందని సమాచారం. పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

ఎవరీ నయీం?

నల్గొండ జిల్లా భువనగిరిగి చెందిన నయీం సమ సమాజ స్థానప కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరాడు.య వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేశాడు. వారికి సన్నిహితుడిగా మెలిగాడు.

నక్సలైట్ జీవితం ప్రారంభించిన నయీం, ఆ తర్వాత నక్సల్స్‌ను అంతం చేయడం తన జీవిత ఆశయమని ప్రకటించాడు. అనేకచోట్ల ప్రదర్శనలు నిర్వహించాడు. ఈ క్రమంలో పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలు చేరవేసేవాడనే వాదనలు ఉన్నాయి. నయీం ఇచ్చిన సమాచారంతో పోలీసులు అనేకమంది పీపుల్స్ వార్, మావోయిస్టు నేతలను మట్టుపెట్టినట్లుగా కూడా చెబుతారు. నయీంకు ఉన్నతాధికారులతోను సత్సంబంధాలు ఉన్నాయి. అతను అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు సీబీఐ కూడా కనిపెట్టలేకపోయింది.

నయీం అజ్ఞాతంలో ఉండగా బెల్లి లలిత దారుణ హత్యకు గురయింది. దీంతో అతని పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. అనంతరం గ్రేహౌండ్స్ ఆద్యుడు ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో నిందితుడు ఈ కేసు పద్నాగేళ్ల తర్వాత కోర్టులో వీగిపోయింది.

నయీం సోదరుడు నిజాం అలీని ప్రత్యర్థులు చంపినట్లుగా చెబుతుంటారు. మాజీ మావోయిస్టులు గణేష్, ఈదన్న హత్య వెనుక నయీం ప్రమేయం ఉందని, తెరాస నాయకుడు సాంబశివ రావు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డిల హత్యలోను ఇతను నిందితుడు.య

నయీం నేరాలు చేయించే స్టయిలే, ఆ తర్వాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోను పోలీసులు నయీంకు వ్యతిరంగా ఆధారాలు సేకరించలేకపోతున్నారంటారు. హైదరాబాదుకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీకి నయీం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

ఖాళీ చేయిస్తున్న పోలీసులు

ఖాళీ చేయిస్తున్న పోలీసులు

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్‌లో నయీం తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్న దృశ్యం

నయీం

నయీం

నయీం గత 12 ఏళ్లుగా అండర్ గ్రౌండులో ఉన్నాడు. పోలీసులు అతని కోసం పదిహేనేళ్లుగా వెతుకుతున్నారు. అతని సోదరుడు అలీముద్దీన్ కూడా గతంలో గ్యాంగ్ స్టర్.

నయీం హతం

నయీం హతం

షాద్ నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్‌లో నయీంను హతమార్చిన పోలీసులు, సంఘటన స్థలం నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఖాళీ చేయిస్తున్న పోలీసులు

ఖాళీ చేయిస్తున్న పోలీసులు

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్‌లో నయీం తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్న దృశ్యం

నయీం

నయీం

గ్యాంగ్ స్టర్ నయీం పైన వందకు పైగా కేసులు ఉన్నాయి. అందులో ఇరవై వరకు హత్య కేసులు. నయిం ఎన్నో సెటిల్మెంట్లు చేశాడు.

నయీం

నయీం

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్‌లో నయీం తలదాచుకున్నాడని తెలిసిన పోలీసులు ఇంటిని చుట్టుముట్టి, అతనిని కాల్చి చంపారు. నయీం డిగ్రీ పూర్తి చేశాడు.

English summary
NIA searches in Shad Nagar of Mahaboobnagar District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X