Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుట్టు విప్పిన నిక్కీ జోసెఫ్ కాల్ డేటా: దొరికిన హైదరాబాద్ టూ సిరియా రూట్

హైదరాబాద్: ఇటీవల పట్టుబడిన ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరురాలు నిక్కీ జోసెఫ్ అలియాస్ ఆఫ్షా జబీన్ కస్టడీ విచారణలో పోలీసులకు కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోది. పోలీసులకు లభించకుండా ఆమె డిలీట్ చేసిన కీలక డేటాను అధికారులు రాబట్టినట్లు సమాచారం. ఆమెకున్న లింక్‌లతోపాటు దేశంలో ఎంతమందిని ఆకర్షించిన విషయాలపై పోలీసులకు ఆధారాలు లభించాయి.

ముఖ్యంగా ఆమె సంభాషణలు, పోస్టింగ్‌లకు ఆకర్షితులైన హైదరాబాద్‌కు చెందిన యువత వివరాలు పోలీసులు కనుగొన్నారు. అరెస్టుకు ముందు ఆమెతో ఎవరెవరు టచ్‌లో ఉన్నారనే వివరాలను పోలీసులు సేకరించారు. దొరికిన ఆధారాలతో దాదాపు 50 మంది అనుమానితులపై నిఘా పెట్టారు.

నిక్కీ జోసెఫ్ నాలుగు ఫేస్‌బుక్ అకౌంట్‌లతోపాటు మరికొన్ని సోషల్ మీడియా అకౌంట్ల డేటాను పోలీసులు భద్రపర్చుకున్నారు. వీటిలో ఐఎస్‌ఐఎస్ వైపు మొగ్గుచూపుతున్న యువత సమాచారం లభించింది. వీరంతా సిరియాకు ఎలా వెళ్లాలన్న రూటును పోలీసులు సేకరించుకుని ముందస్తుగా ఇతర రాష్ర్టాలు, దేశాల అధికారులను అప్రమత్తం చేశారు.

Nicky Joseph reveals the route from Hyderabad to Siriya

నిక్కీ జోసెఫ్ తన అకౌంట్లలో డౌన్‌లోడ్ చేసిన జిహాది సాహిత్యంతో ఇతర వీడియోలను ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసింది, వాటి ఐపీ అడ్రస్‌లను పోలీసులు కనిపెట్టారు. నిక్కీ జోసెఫ్ హైదరాబాద్‌తోపాటు దేశంలో ఇంకా ఎక్కడైనా విధ్వంసాలకు పాల్పడేందుకు కుట్ర పన్నిందా అనే అనుమానాలపై విచారణాధికారులు ప్రశ్నలను సంధించారు.

కాగా, ఇప్పటి వరకు నిక్కీ జోసెఫ్ కస్టడీలో పోలీసులకు అంతగా సహకరించలేదని అంటున్నారు. విచారణను తప్పించేందుకు నిక్కీ చాలా మొండిగా ప్రవర్తిస్తున్నదని విశ్వసనీయ సమాచారం. దుబాయ్ నుంచి వచ్చిన ఆమెను ఈ నెల పదో తేదీన అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెను కోర్టు అనుమతితో సైబరాబాద్ పోలీసులు పది రోజుల కస్టడీకి తీసుకున్నారు.

సైబరాబాద్ పోలీసులతోపాటు కేంద్ర నిఘా వర్గాల అధికారులు ఆమెను విచారిస్తున్నారు. నిక్కీ జోసెఫ్ కేసు వ్యవహారం సున్నిత అంశం కావడంతో పోలీసులు వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఏ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు. గురువారం ఆమె కస్టడీ పూర్తవడంతో పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+