ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్: వాకర్‌తో టెక్కీ నిఖిల్, గొంతు కోసుకుంటానని తండ్రి
హైదరాబాద్: ఎత్తు పెరిగేందుకు కాళ్లకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్‌ను తెలంగాణ వైద్య మండలి (టీఎంసీ) సస్పెండ్ చేయడంతో నిఖిల్‌రెడ్డిని శనివారం వైద్య నిపుణుల బృందం పరీక్షించింది. టీఎంసీ సూచన మేరకు నిఖిల్‌రెడ్డి చికిత్స కోసం ఆర్థోపెడిక్ వైద్యులను వినియోగించాలని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసో సియేషన్(టిషా) నిర్ణయించింది.
ఈమేరకు గ్లోబల్ ఆసుపత్రికి నిఖిల్‌రెడ్డిని రప్పించి డాక్టర్ వీఎస్‌రెడ్డి, డాక్టర్ బుజ్జిబాబు, డాక్టర్ రవీంద్రనాథ్‌ల బృందం పరీక్షించింది.ఖిల్ రెడ్డిని పరీక్షించి కాళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకలేదని నిర్ధారించుకున్నామని విఎస్ రెడ్డి మీడియాతో చెప్పారు. నిఖిల్‌రెడ్డి కూర్చొని తన పనులు తాను చేసుకోవడంతో పాటు వాకర్ సాయంతో కొద్ది అడుగుల దూరం నడవగలుగు తున్నాడని తెలిపారు.

ఈ విధమైన శస్త్రచికిత్సలలో రోగి ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో సాధారణ స్థాయికి చేరుకుంటారని వివరించారు. నిఖిల్‌రెడ్డితో పాటు వారి తల్లిదండ్రులు అంగీకరిస్తేనే చికిత్స అందజేస్తామని, లేదంటే ఇతరులకు సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు. మరికొన్ని వైద్య పరీక్షలు జరిపి, వాటి ఫలితాలను పరిశీలించి తదుపరి చికిత్స ప్రారంభిస్తామని అన్నారు.
తండ్రి హెచ్చరిక
కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎత్తు పెరిగేందుకు కాళ్లకు శస్త్రచికిత్స చేసిన గ్లోబల్ ఆసుపత్రిపై, డాక్టర్ చంద్రభూషణ్‌పైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిఖిల్ తండ్రి గోవర్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. డాక్టర్‌పై చర్యలు తీసుకునే విషయమై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తు న్నారని ఆయన ఆరోపించారు. నిర్లక్ష్యం వీడి ఆస్పత్రి, వైద్యుడిపై చర్యలు తీసుకోకుంటే పోలీస్ స్టేషన్ ఎదుట గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడుతానని హెచ్చరించారు.
ఎన్నో సర్జరీలు చేశామని చెప్పి రెండు రోజుల్లోనే నడిపిస్తానని చెప్పి నమ్మించి డాక్టర్ చంద్రభూషణ్ తన కొడుకు జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. ఇప్పటికి ఏడు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి లేదని గోవర్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications