చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు- మార్గదర్శకాలు..!!
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల పేరెంట్స్ కు తీపి కబురు. హైదరాబాద్ నిమ్స్ గుండె సమస్యలు ఉన్న చిన్నారుల చికిత్స కోసం ముందుకు వచ్చింది. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. ఆగస్టు 13 నుంచి చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్స లు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. గత ఐదేళ్లుగా ప్రతి ఏటా నిమ్స్ ఈ ఉచిత శస్త్రచికిత్సల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది.
గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారుల కోసం నిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయి. అవసరాన్ని బట్టి ప్రాధాన్య త కేటాయిస్తూ వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలిస్తారని చెప్పుకొచ్చారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి న అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ అమరేశ్వర్ నేతృత్వంలో ఈ ఆపరేషన్లు చేయనున్నారు. లండన్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నషునేని, లండన్ వైద్యుల బృందంతో పాటుగా పలువురు సిబ్బంది ఈ శస్త్రచికిత్సల్లో పాల్గొంటారు.

నిపుణులతో చిన్నారులకు వైద్యం
చికిత్స కోసం సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీటీ సర్జరీ కార్యాలయం, మొదటి అంతస్తు, పాత బ్లాక్, నిమ్స్ లో సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇందు కోసం ఎటువంటి ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదు. చిన్నారులను నేరుగా తీసుకొస్తే వాక్-ఇన్ విధానంలో ప్రాధాన్యతను బట్టి పరిశీలిస్తారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ అవసరమైన పిల్లలను ఎంపిక చేయనున్నారు. పిల్లలకు సంబంధించి ఇదివరకే చేయించిన వైద్య పరీక్షల నివేదికలు, పాత మెడికల్ రికార్డులు ఉంటే వెంట తీసుకురావాలని సూచిస్తున్నారు. దీని ద్వారా గుండె సమస్యలతో ఇబ్బంది పడుతూ.. ఆపరేషన్లు చేయించే అవకాశం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి నిమ్స్ లో ఈ ఆపరేషన్లు మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన చిన్నారుల పేరెంట్స్ పూర్తి వివరాలతో ఆస్పత్రిలో సంప్రదించాలని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications