కోరిక తీర్చమని లెక్చరర్ వేధింపు, లాడ్జిలో రాసలీలల టీచర్‌పై నిర్భయ కేసు
నల్గొండ/ఖమ్మం: తన కోరిక తీర్చాలంటూ ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఓ కాంట్రాక్ట్ అధ్యాపకుడిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వెలుగు చూసింది.
జూనియర్ కళాశాలలో కామర్స్ ఒప్పంద అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్న లింగరాజు ఇదే కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేని ఆమె గురువారం ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.
దీంతో, లింగరాజు కీచక ప్రవృత్తి వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఆరైవోకు, ఆరైవో ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం వేధింపులకు పాల్పడిన ఒప్పంద అధ్యాపకుడు లింగరాజును విధుల్లో నుంచి తొలగించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

'రాసలీలల' ఉపాధ్యాయుడిపై నిర్భయ కేసు
ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి మభ్య పెట్టి, ఆ బాలికతో లాడ్జిలో గడుపుతూ నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు నాగేశ్వర రావు పైన నిర్భయ కేసు నమోదయింది.
పదో తరగతి చదువుతున్న బాలికను బుధవారం మధ్యాహ్నం సూర్యాపేటలోని ఒక హోటల్‌కు తీసుకొచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తులిచ్చిన సమాచారం మేరకు విషయం తెలుసుకున్న బాలిక తల్లి సూర్యాపేటకువచ్చి పోలీసుల సహాయంతో ఉపాధ్యాయుడ్ని తన కుమార్తెతో సహా ప్రత్యక్షంగా పట్టుకుంది.
విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై నిర్భయ చట్టంతోపాటు అత్యాచారం, అపహరణ కేసులు నమోదు చేశారు. బాలికను ఆమె తల్లికి అప్పగించారు. ఉపాధ్యాయుడు నాగేశ్వర రావును కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications