ఏం మాట్లాడుతున్నావ్.. కేటీఆర్? -నువ్వు మగాడివి అయితే -ఆ పనికి ప్యాంట్ తడిసిపోద్ది: ఎంపీ అర్వింద్
ఏకకాలంలో తెలంగాణ బీజేపీ నేతలు మూకుమ్మడిగా టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయి విమర్శల దాడులు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బొదపెడతామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించగా, ఈసారి సిరిసిల్లలో సీఎం తనయకుడు, మంత్రి కేటీఆర్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తామని, కవితకు పట్టిన గతే ఆయనకూ పట్టిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిప్పులు చెరిగారు.

డబ్బులు మీ జేబులోవా?
వరద సాయం కింద హైదరాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సాయం.. కేటీఆర్ జేబులో నుంచి ఇస్తున్నది కాదని, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బేలేననే విషయం గుర్తుంచుకోవాలని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరద సాయానికి కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, ప్రజల డబ్బులనే ఇస్తూ.. దానిపై టీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారన్నారని ఎంపీ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కేటీఆర్ సోదరి కవిత, మరో మంత్రి హరీశ్ రావు.. ఇలా అందరి జీతాలు ప్రజల డబ్బేనని గుర్తుచేశారు.

నువ్వు మగాడివైతే..
‘‘కేసీఆర్ కొడుకు కాబట్టే కేటీఆర్ అహంకార పూరిత భాష మాట్లాడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రజల కోసమే కొట్లాడుతారని కేటీఆర్ కు నిరూపించారు. అభిషేక్ లాంటి కార్యకర్తను చూసి గర్విస్తున్నాం. ఖబర్దార్ కేటీఆర్.. దుబ్బాకలో ఏడు చెరువుల నీళ్లు తాగించాం. సిరిసిల్లలో నువ్వు ఓడకపోతే అడుగు. నువ్వు మగాడివే అయితే కార్యకర్తకు క్షమాపణ చెప్పాలి. ప్రస్టేషన్‌లో ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ కార్యకర్తలను విమర్శించడం మానెయ్. మా కార్యకర్త ఇల్లు నిజంగానే మునిగింది. ఆఫీసర్లు ఇస్తే లబ్ది పొందాడు. రానివారి కోసం పోరాటం చేస్తే తప్పేముంది?''అని ఎంపీ అర్వింద్ అన్నారు.

కేటీఆర్ ప్యాంటు తడిసిపోద్ది..
హైదరాబాద్ లో వరదలకు కారణమైన అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ తీరు జనమంతా గమనిస్తున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. అక్రమ కట్టడాలు కూల్చడంతో గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ పనితీరు గురించి తెలుసుకోవాలని, మోదీ తన హాయంలో 2 లక్షల అక్రమ కట్టడాలను కూల్చేశారని అర్వింద్ గుర్తుచేశారు. ‘‘బీజేపీ ఏనాడూ ఎన్నికల కోసం పని చేయదు. ఓవైసీ చెమ్చా గిరీ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ చేశానని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. పాతబస్తీలో పాన్ దుకాణం తీయాలన్నా.. కేటీఆర్ ప్యాంట్ తడిసిపోద్ది'' అని బీజేపీ ఎంపీ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications