బాబుపై కవిత, ఘనంగా హరీశ్ బర్త్ డే(ఫోటోలు)
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబును A1గా చేర్చాలని నిజామాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేసీఆర్ శంకుస్థాపనలకే పరిమితమయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదని, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడలేకే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు పాల దుకాణం, పార్టీని మూసుకుని.... హైదరాబాద్‌లో కొబ్బరికాయల దుకాణం పెట్టుకుంటే బాగుంటుందన్నారు. రేవంత్ రెడ్డి కేసులో ఏసీబీ అధికారులు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును A1గా చేర్చాలని సూచించారు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనకు ఐదు మార్కులే వేస్తానన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై కూడా స్పందించారు. తమకు రాజకీయ నాయకుల మార్కులు అవసరం లేదని, ప్రజలు తమను గుర్తించారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పాలను విసుగెత్తి పోయిన ప్రజలు వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని అన్నారు.

చంద్రబాబుపై కవిత
చంద్రబాబు నాయుడు పాల దుకాణం, పార్టీని మూసుకుని.... హైదరాబాద్‌లో కొబ్బరికాయల దుకాణం పెట్టుకుంటే బాగుంటుందన్నారు. రేవంత్ రెడ్డి కేసులో ఏసీబీ అధికారులు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును A1గా చేర్చాలని సూచించారు.

చంద్రబాబుపై కవిత
ఆ తర్వాత నిజామాబాద్‌లోని ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో రూ.140 కోట్లతో మామిడిపల్లి నుంచి జిల్లా కేంద్రం వరకు చేపట్టనున్న రైల్వే పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే బడ్జెట్‌లో ఈ రైల్వే పనులకు రూ.100 కోట్ల వరకు మంజూరు చేయించి మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.

ఘనంగా హరీశ్ బర్త్ డే
రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మంత్రుల క్వార్టర్స్‌లో సహచర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా హరీశ్ బర్త్ డే
ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు, విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా హరీశ్ బర్త్ డే
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రుల నివాస ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లాంగ్ లివ్ హరీశ్‌రావు అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నినాదాలు చేశారు.

Click it and Unblock the Notifications