నిజాం నగలపై కీలక అప్డేట్ ఇచ్చిన కేంద్రం

హైదరాబాదును పాలించిన నిజాం పాలకుల కాలానికి చెందిన విలువైన అభరణాల గురించి తాజాగా కేంద్రం ఒక కీలక అప్డేట్ ను ఇచ్చింది. లోక్సభలో తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ కేంద్ర మంత్రి ఆసక్తికర సమాధానం చెప్పారు. నిజాం నవాబుల కాలంలో వారు వినియోగించిన 173 నగలు హైదరాబాద్లోనే వేరే చోటుకు మార్చాలన్న తెలంగాణ ప్రతిపాదన పైన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు.

నిజాం నగలపైన కేంద్రం అప్డేట్

నిజాం నగల అంశం పైన ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆయన ఈ నగలను హైదరాబాద్లోనే వేరే చోటుకు మార్చడంపైన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఈ నగలను 1995వ సంవత్సరం నుంచి ఆర్బిఐ లో భద్రంగా ఉంచామని వాటి చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆసక్తిని గమనించిన తర్వాత సాంస్కృతిక మంత్రిత్వశాఖ వాటిని మార్చే ప్రయత్నం చేయలేదని వెల్లడించారు.

nizams jewels center said key update on nizams jewels shifting process to another place in hyderabad

అపురూపమైన నగలను కలిగి ఉన్న నిజాం నవాబులు

ప్రస్తుత ఆర్.బి.ఐ తో ఉన్న ఒప్పందం ప్రకారం ఈ నగలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాయని వాటిని వేరే చోటికి మార్చడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.హైదరాబాద్ ని పాలించిన ఏడుగురు నిజాం నవాబులు అపారమైన ధనసంపద తో పాటు అపురూపమైన నగలను కలిగి ఉండేవారు. వీరు వినియోగించిన నగలలో ఎక్కువ భాగం వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, రూబీలు వంటి విలువైన రత్నాలతో తయారు చేయబడినవి.

నిజాం నగలలో ప్రసిద్ధి చెందినవి ఇవే

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల్లో ఒకటి అయిన జాకబ్ డైమండ్, అత్యంత నాణ్యత కలిగిన సహజ ముత్యాలు అయిన నిజాం ముత్యాలు, పచ్చలు, రూబీ లు మరియు నీలాల తో చేసిన హారాలు, కిరీటాలు, కంఠాభరణాలు, చెవి కమ్మలు ఇలా మొత్తం 173 ప్రసిద్ధ నిజాం నగలు కొంత భాగం భారత ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. వీటిని ప్రత్యేక సందర్భాలలో దేశవ్యాప్తంగా మ్యూజియంలో ప్రదర్శిస్తారు.

నిజాం నగలు వారి వైభవానికి ప్రతీకలు

నిజాం నగలు కేవలం ఆభరణాలు మాత్రమే కాదు అవి నిజాం నవాబుల వైభవాన్ని, హైదరాబాద్ సంస్కృతిని, వారి రాజ వంశీరాజ వంశీయుల సంపదను తేటతెల్లం చేస్తాయి. భారతదేశ చరిత్రలో అత్యంత అరుదైన ఖరీదైన రాజ వంశీయుల నగలుగా హైదరాబాద్ ని పాలించిన నిజాం నవాబుల నగలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+