గోల్కొండ కోటలో డిన్నర్: కెసిఆర్ ఆఫర్‌కు ఇవాంక నో

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడి కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్‌ గోల్కొండ కోట విందుకు హాజరు కావడం లేదని సమాచారం.

హైదరాబాద్: ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడి కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్‌ గోల్కొండ కోట విందుకు హాజరు కావడం లేదని సమాచారం. ఆమె హైదరాబాదులోని ట్రైడెంట్ హోటెల్‌లో బస చేస్తున్నారు.

ఆమెకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. ఫలక్‌నుమా హోటల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు ప్రత్యేక విందు ఇస్తున్నారు. గోల్కొండ కోటలో విందు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

మోడీ విందుకు ఓకే..

మోడీ విందుకు ఓకే..

మోడీ ఫలక్‌నుమా హోటల్లో ఇచ్చే విందులో మాత్రమే ఇవాంకా పాల్గొననున్నట్లు అమెరికా భద్రతాధికారులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 8.45 గంటలకు మోదీ ఇవ్వనున్న విందులో ఇవాంకా పాల్గొంటారు. ఆ తర్వాత బుధవారం ఉదయం జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు.

Recommended Video

    Global Entrepreneurship Summit : Ivanka Trump reached HICC, Video
    చూసేందుకు సరే....

    చూసేందుకు సరే....

    బుధవారం మధ్యాహ్నం ఇవాంక గోల్కొండ పర్యటనకు వెల్తారు. బుధవారం రాత్రి గోల్కొండ కోటలో ఇవాంకాకు విందు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఆ విందుకు ఇవాంకా హాజరు కావడం లేదని, బుధవారం సాయంత్రమే అమెరికాకు తిరిగి వెళ్లనున్నారని సమాచారం.

    ఇద్దరూ గైర్హాజరు...

    ఇద్దరూ గైర్హాజరు...

    ప్రధాని మోడీ కూడా జీఈ ఎస్ సదస్సును ప్రారంభించి, ఇవాంకాకు ప్రత్యేక విందు ఇచ్చిన తర్వాత మంగళవారం రాత్రికే ఢిల్లీకి తిరిగి వెళ్తారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఇవ్వాలనుకుంటున్న విందుకు మోడీ, ఇవాంకా ఇద్దరు కూడా హాజరు కావడం లేదు.

    చార్మినార్ పర్యటన కూడా రద్దు...

    చార్మినార్ పర్యటన కూడా రద్దు...

    హైదరాబాద్ నగరానికి ప్రతీకగా భావించే చార్మినార్ సందర్శనను కూడా ఇవాంక రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా పాతబస్తీకి వెళ్లడం లేదని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+