Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వ్యక్తిగత నిర్ణయాలుండవు: కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి భరోసా

హైదరాబాద్: పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటానని తెలంగాణ నూతన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఆయన తెలంగాణ సీనియర్ నేతలను కలిసిన విషయం తెలిసిందే.

Recommended Video

    Revanth Reddy As TPCC President: Chandrababu Role ? | Oneindia Telugu

    పార్టీ నిర్ణయం మేరకు అందరం కలిసి ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ప్రజా పునరేకీకరణ జరగాల్సి ఉందన్నారు. కేసీఆర్ ప్రజలను విడదీసి అధికారాన్ని పదిలం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణకు సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

     No more personal decisions: TPCC new president Revanth Reddy

    కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంస్థాగతంగా కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ముందుంటామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం, బలం తక్కువేనని అన్నారు. ఇటీవల బెంగాల్‌లో బీజేపీ ఓడిపోయిందన్నారు.

    తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకమైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏఐసీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే జులై 7న మధ్యాహ్నం 1.30 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్‌లు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

    ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్ రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్ శెట్కర్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, కుమార్ రావు, జావేద్ అమీర్ లను నియమించింది. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్, సయ్యద్ అజమ్ తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్ రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటీ మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. కాగా, కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రేవంత్ రెడ్డికి పార్టీ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్ లాంటి కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి నియామకాన్ని స్వాగతించడం లేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+