వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీకంటే డ్రామాలు ఆడేవారులేరు, బాబే ఫేమస్: రామ్ మాధవ్ సంచలనం, బీజేపీ గుస్సా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ క్రీడలో చంద్రబాబును మించిన వారు లేరని అభిప్రాయపడ్డారు.

పొలిటికల్ గేమ్‌లు ఆడటంలో చంద్రబాబును మించిన వారు ఒక్కరు కూడా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జిమ్మిక్కులకు ఆయన పేరుగాంచారని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి కోసం తాము మొదటి నుంచి అతని వెంట ఉన్నామన్నారు.

ఏపీలో పొలిటికల్ హీట్, ఏం జరగనుంది.. ఇంటెలిజెన్స్ ఆరా? కొందరి ప్రయివేటు సర్వేఏపీలో పొలిటికల్ హీట్, ఏం జరగనుంది.. ఇంటెలిజెన్స్ ఆరా? కొందరి ప్రయివేటు సర్వే

రాజకీయ డ్రామాలు టీడీపీవే ఎక్కువ

రాజకీయ డ్రామాలు టీడీపీవే ఎక్కువ

ఆంధ్రప్రదేశ్‌లో తాము ఇతర పార్టీలతో కలిసి టీడీపీకి చెక్ పెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని రామ్ మాధవ్ ఖండించారు. రాజకీయ డ్రామాలు అనే విషయానికి వస్తే ఎక్కువగా అలాంటివి చేసింది ఆ పార్టీయే అని చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చారు.

చులకనగా చూశారు, జగన్ అండతో అణగదొక్కాలని: మోడీ-పవన్‌లపై చంద్రబాబుచులకనగా చూశారు, జగన్ అండతో అణగదొక్కాలని: మోడీ-పవన్‌లపై చంద్రబాబు

టీడీపీ అవిశ్వాసం రాజకీయం

టీడీపీ అవిశ్వాసం రాజకీయం

టీడీపీ లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై తమకు ఎలాంటి భయం లేదని రామ్ మాధవ్ చెప్పారు. తమకు సరైన బలం ఉందని చెప్పారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం రాజకీయం అన్నారు.

హఠాత్తుగా ఎందుకు ఇలా చేశారు

హఠాత్తుగా ఎందుకు ఇలా చేశారు

అసలు తెలుగుదేశం పార్టీ హఠాత్తుగా సెంటిమెంట్ ఇష్యూని తెరపైకి ఎందుకు తీసుకు వచ్చిందని, అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతుందని, వీటిపై ఏపీ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని రామ్ మాధవ్ అన్నారు.

ముగ్గురిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

ముగ్గురిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు సభలో టీడీపీని ఏకిపారేసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, తెలుగు తమ్ముళ్లు బీజేపీతో పాటు వైసీపీ, జనసేనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్, జగన్‌ల వెనుక బీజేపీ ఉందని ఆరోపిస్తున్నారు. పవన్, జగన్‌లతో కలిసి టీడీపీని అణిచివేయాలని బీజేపీ చూస్తోందని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

మాటల యుద్ధం

మాటల యుద్ధం

తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బీజేపీపై తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు వాటికి కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు, ఏపీ బీజేపీ నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధమే నడుస్తోంది. కానీ కేంద్రమంత్రులు వంటి వారి మాత్రం తాము అన్ని విధాలా సహకరించామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలపై బీజేపీ గుస్సా

చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలపై బీజేపీ గుస్సా

అయితే, టీడీపీ నేతల మాటలను పక్కన పెడితే, చంద్రబాబు వ్యాఖ్యలు బీజేపీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయని అంటున్నారు. తమిళనాడు తరహా పాలిటిక్స్ ఏపీలో చేయాలని బీజేపీ చూస్తోందని, పవన్-జగన్‌లతో కలిసి టీడీపీని అణగదొక్కాలని చూస్తోందని, ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోందని స్వయంగా చంద్రబాబు మాట్లాడటం బీజేపీ జీర్ణించుకోవడం లేదని అంటున్నారు. అందుకే రామ్ మాధ్ గట్టి గౌ

English summary
No one can beat N Chandrababu Naidu in playing political games. He is famous for indulging in political gimmicks.We are with him as far as demand for development of Andhra Pradesh is concerned but if he talks about political drama most political games are played by TDP: Ram Madhav
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X