ఒక్క ఎమ్మెల్యే కారు ఎక్కరు: కేసీఆర్‌ని ఏకేసిన వివేక్

పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్లే విద్యుత్ సమస్య వచ్చిందన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి కేసీఆర్ తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు చేతకాక చంద్రబాబు పైన విమర్శలు చేస్తున్నారన్నారు. కాగా, తలసాని, ఎర్రబెల్లి దయాకర రావు సహా పలువురు ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్తారనే ప్రచారం సాగిన విషయం తెలిసిందే.
స్వచ్ఛ భారత్‌ను ఉద్యమంగా చేపట్టాలి: వెంకయ్య
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ యాంత్రికంగా తంతులా ముగించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదన్నారు.
ప్రభుత్వంతో పాటు ప్రజలు ఇందులో పాల్గొనాలన్నారు. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు దాటినా గ్రామాల్లో మురుగు దొడ్ల సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. పరిశుభ్రతను పట్టించుకోకపోతే సామాజిక జబ్బుగా పరిణమించే ప్రమాదముందని హెచ్చరించారు. చెత్త, అపరిశుభ్రం వల్ల రోగాలు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications