షాక్ : అమ్మాయిలకు రూమ్ లు అద్దెకు దొరకడం లేదు, కారణమదేనా?
హైద్రాబాద్ లో అమ్మాయిలకు అద్దెకు రూమ్ లు దొరకడం లేదు. అయితే నాన్ వెజ్ తినే అమ్మాయిలకు రూమ్ లు అద్దెకు ఇచ్చేందుకు యజమానులు ఆసక్తిని చూపడం లేదని ఓ సర్వే చెబుతోంది.
హైదరాబాద్ :హైద్రాబాద్ లో అమ్మాయిలకు అద్దెకు రూమ్ లు దొరకడం లేదు. కోచింగ్ ల కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చే అమ్మాయిలకు ఇదే పరిస్థితి నెలకొంది. ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది.
అమ్మాయిలకు సులువుగా అద్దెకు రూమ్ లు దొరుకుతాయనే అభిప్రాయం ఉంది.అయితే ఈ అభిప్రాయం తప్పని నెస్ట్ ఎవే అనే పాపులర్ హోం రెంటల్ సంస్థ సర్వేలో తేటతెల్లమైంది.అమ్మాయిలకు రూమ్ లు దొరకకపోవడాని ప్రధాన కారణాలను చూస్తే ఆశ్చర్యపోతారు.
చిన్న చిన్న జాబ్ లు చేసే అమ్మాయిలు, కోచింగ్ ల కోసం వచ్చేవారు , ఇతర ప్రాంతాల నుండి చదువుకొనేందుకు హైద్రాబాద్ కు వచ్చే వారికి అద్దెకు రూమ్ లు దొరకడం లేదు.

ఈ సంస్థ దేశంలోని ప్రధాన నగరాలైన ముంబాయి, బెంగుళూరు, పూణె, హైద్రాబాద్ లలో దాదాపు మూడువేల మంది అవివాహిత యువతులపై సర్వే చేసింది. ఈ సర్వే లో ఇతర నగరాలను పక్కన పెడితే హైద్రాబాద్ నగరంలో అమ్మాయిలకు అద్దెకు రూమ్ లు దొరకడం లేదు
మాంసాహరం తినే అమ్మాయిలకు హైద్రాబాద్ లో అద్దెకు రూమ్ లు దొరకడం లేదు. హైద్రాబాద్ లో 19 శాతం హౌజ్ ఓనర్లు మాంసం తినే అలవాటున్న అమ్మాయిలకు రూమ్ లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.
కులమతాలు, ప్రాంతీయ కారణాలను చూపుతూ అమ్మాయిలకు రూమ్ లు అద్దెకు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారని సమాచారం.అయితే నాన్ వెజ్ ను కారణంగా చూపుతూ అమ్మాయిలకు ఇళ్ళను అద్దెకు ఇవ్వకపోవడం అనే సమస్య ఉండదని మరికొందరు చెబుతున్నారు.అమ్మాయిలకు రూమ్ కు అద్దెకు ఇవ్వకపోవకపోవడానికి ఇతర కారణాలు ఉంటే వాటినిక పైకి చెప్పకుండా ఈ కారణం చెప్పే అవకాశాలు కూడ లేకపోలేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications