ఏపీ పుస్తకాల్లో టి చరిత్రకు నో: వెళ్లిపో.. బాబుకు శ్రీనివాస్ గౌడ్ అల్టిమేటం
హైదరాబాద్: ఏపీ పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్రను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ శాసన సభా పక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మ్ట్లాడారు.
ప్రజల మధ్య విద్వేషాలు, రెచ్చగొట్టే చర్యలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రను తొలగిస్తే ఈ గడ్డమీద ఏపీకి చెందిన వారి విగ్రహాలు, కాలనీలకు, పార్కులకు పేర్లు ఎందుకుండాల్నారు.
విశాలాంధ్ర కోసం కృషి చేసిన బూర్గుల రామకృష్ణ రావు, గిరిజన దేవతలైన సమ్మక్క, సారక్కలతో పాటు హైదరాబాదుకు సంబంధించిన అంశాలన్నీ తొలగించాలని పేర్కొనడం దారుణమన్నారు. రెండు రోజుల్లో ఏపీ సర్కారు తన చర్యలను ఉపసంహరించుకోకుంటే ప్రతిచర్యలకు దిగుతామన్నారు.

ఆంధ్రాకు చెందిన వారి పేర్లు, విగ్రహాలు తొలగించాలని సిఎం కెసిఆర్‌కు, జిహెచ్ఎంసీలకు లేఖలు రాస్తామన్నారు. ఇక్కడున్న వారి విగ్రహాలను తీసుకెళ్లాలని, అవసరమైతే లారీ అసోసియేషన్‌తో మాట్లాడి రెండున్నర లక్షల లారీలతో 2 రోజుల పాటు ఉచితంగా సర్వీస్ చేయిస్తామన్నారు.
ఏపీ తీరుపై స్పందించని పార్టీలను నిలదీస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్రను తొలగించాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. చంద్రబాబూ.. తీరు మార్చుకోక పోతే తక్షణమే మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపో అని అల్టిమేటం జారీ చేశారు.
రెండ్రోజుల్లోగా సర్క్యులర్‌ను విరమించుకోవాలని, లేదంటే శంషాబాద్ విమానాశ్రయంతో పాటు అన్ని ఆంధ్రా నేతల పేర్లను తొలగించాలని, ట్యాంక్ బండ్‌పైనున్న ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను తొలగించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు.
-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications