విషపూరిత నురగ, బస్సుకు తప్పిన ప్రమాదం: కొరియా లేక్‌ను పరిశీలించిన కేటీఆర్

నల్గొండ - రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లోని అనంతారం వద్ద మూసీ వంతెన పైన ఆర్టీసి బస్సుకు మూడు రోజుల క్రితం తృటిలో ప్రమాదం తప్పింది. మూసీ నది నీటిలో వచ్చిన నురగ వంతెనను కమ్మేసింది.

హైదరాబాద్: నల్గొండ - రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లోని అనంతారం వద్ద మూసీ వంతెన పైన ఆర్టీసి బస్సుకు మూడు రోజుల క్రితం తృటిలో ప్రమాదం తప్పింది. మూసీ నది నీటిలో వచ్చిన నురగ వంతెనను కమ్మేసింది.

డ్రైవరుకు రోడ్డు కనిపించలేదు. దీంతో బస్సు వంతెన కిందకు దిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆ బస్సు చెంగిచెర్ల డిపోకు చెందినది.

బుధవారం ఉధయం యాదాద్రి జిల్లాలోని బూధాన్ పోచంపల్లి నుంచి బస్సు సికింద్రాబాద్ వెళ్తోంది. బస్సు పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామ శివారులోని అనంతారం మూసి వంతెన వద్దకు చేరుకోగానే రసాయనాలతో కలిసిన నురగ రోడ్డు పైకి వచ్చింది.

Not just Bengaluru lakes: toxic froth from Hyderabad's Musi river almost engulf a bus

బస్సు వంతెన మధ్యలోకి వెళ్లగానే డ్రైవరుకు ఏమీ కనిపించలేదు. ఎడమ పక్కకు తిప్పడంతో ముందు టైరు వంతెన కిందకు దిగింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపేశాడు. ప్రయాణీకులను దింపేశారు. బస్సులో అప్పుడు 24 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఎవరికీ ఏం కాలేదు.

హైదరాబాదులో 1960ల నుంచి ఫార్మా బూమ్ పుంజుకుంది. 1990ల నాటికి ఫార్మా రంగం మరింత చాలా విస్తరించింది.

1999లో ప్రభుత్వం జినోమ్ వ్యాలీ ప్రాజెక్టుకు అప్రూవ్ చేసింది. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు వందకు పైగా బయోటెక్ కంపెనీలు పుట్టుకు వచ్చాయి. పలు కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి విషపూరిత నీటిని మూసి నదిలోకి, హుస్సేన్ సాగర్‌లోకి విడుదల చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

తెరాస ప్రభుత్వం వచ్చాక కలుషిత నీటిని సాగర్‌లోకి రాకుండా ప్రణాళికలు చేసింది. వారం రోజుల క్రితమే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దక్షిణ కొరియాలో పర్యటించారు.

మూసి నదిలో విషపూరిత రసాయ నీరు నేపథ్యంలో.. ఆయన అక్కడి చియోంగ్రిచియోన్ నది ప్రక్షాళన తీరును పరిశీలించారు. ప్రక్షాళన కోసం తీసుకున్న కార్యక్రమాలను,పనులను అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+