రాజకీయాలే కాదు.. కుమారుడికి భక్తిని కూడా వంట పట్టిస్తున్న కేసీఆర్...!! దండం పెడుతున్న కేటీఆర్..!!

హైదరాబాద్ : తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావు వైఖరి కొన్ని అంశాల్లో భిన్నంగా ఉంటుంది. కొడుకు కేటీఆర్ కు అన్ని విద్యలు నేర్పించి తెలంగాణలో ఆయన తర్వాతి స్థానాన్ని అంటే రెండో స్థానాన్ని కట్టబెట్టారు. ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేంత వరకూ అనేక మెలకువలు నేర్పించారు. తాజాగా కేటీఆర్ కు ఆద్యాత్మికతను ఒంట పట్టించేందుకు తండ్రిగానే కాకుండా ఓ ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

దేవుణ్ని పెద్దగా నమ్మని కేటీఆర్..! కొడుకులో భక్తి భావాన్ని పెంపొందించే ప్రయత్నంలో కేసీఆర్..!!

దేవుణ్ని పెద్దగా నమ్మని కేటీఆర్..! కొడుకులో భక్తి భావాన్ని పెంపొందించే ప్రయత్నంలో కేసీఆర్..!!

ఇవన్ని పక్కన పెడితే కేటీఆర్ కు స్వతహాగా స్వతంత్ర భావాలు కాస్త ఎక్కువ. అంతే కాకుండా ఏ అంశాన్నైనా హేతుబద్దంగా ఆలోచించే సామర్ధత ఆయన సొంతం. ప్రతి దానికి దేవుడా అనుకునే వ్యక్తిత్వం కేటీఆర్ ది కానే కాదు. శాసన సభలో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు కూడా దేవుడి మీద కాకుండా తన స్వయంక్రుషిని ప్రతిబింబించే రీతిలో ప్రమాణం చేైసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. దాంతో కేటీఆర్ కు తండ్రి చంద్రశేఖర్ రావుకు ఉన్నంత భక్తి లేదని. నామమాత్రంగానే దేవున్ని స్మరించరుకుంటారు తప్ప మరి భక్తి భావంలో మునిగిపోయే మనస్థత్వం కదనే అంశం స్పష్టం అవుతోంది.

అన్ని విద్యలు నేర్పిన కేసీఆర్..! ఒక్క భక్తి భావమే ఒంటికి పట్టించుకోని కేటీఆర్..!!

అన్ని విద్యలు నేర్పిన కేసీఆర్..! ఒక్క భక్తి భావమే ఒంటికి పట్టించుకోని కేటీఆర్..!!

కేటీఆర్ రాష్ట్రంలో మంత్రి హోదాలో పర్యటిస్తున్నప్పుడు కూడా అనేక పుణ్యక్షేత్రాలు తారసపడుతుంటాయి. ఏ ఒక్క ప్రదేశంలోనూ ఆయన దైవదర్శనం చేసుకున్న దాఖలాలు లేవు. అంతెందుకు ఏదైనా సాధించినప్పుడు, నెరవేరని కోరిక నెరవేరినప్పుడు ఎవరైనా ముందుగా వెళ్లేది తిరుమల తిరుపతి దేవస్థానానికి. కేటీఆర్ తెలంగాణ వచ్చినప్పుడు గాని, మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు గాని, గులాబీ పార్టీకి కార్యనిర్వాహాక అద్యక్షుడిగా మారినప్పుడు గాని.. ఎప్పుడు కూడా కూడా ప్రత్యేక పూజలు, పునస్కారాలు నిర్వహించిన దాఖలాలు లేవు. అంతెందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖర్ రావు రెండు సార్లు నిర్వహించిన పరమ పవిత్రమైన హోమాల్లో కేటీఆర్ పాత్ర నామమాత్రంగా ఉంది.

పవిత్న పుణ్యక్షేత్రాలు తిప్పుతున్న తండ్రి..! దండం పెడుతున్న కేటీఆర్..!!

పవిత్న పుణ్యక్షేత్రాలు తిప్పుతున్న తండ్రి..! దండం పెడుతున్న కేటీఆర్..!!

హోమాలు నిర్వహిస్తున్నప్పుడు ఆహ్వాన పత్రాల పేరుతో రాష్ట్రాలు తిరుగొచ్చారు తప్ప హోమకార్యక్రమాలను గురించి పండితులతో అడిగి తెలుసుకునే ఉత్సాహాన్ని కేటీఆర్ చూపించలేదు. అలాంటి కేటీఆర్ కు ఆద్యాత్మికతను, భక్తిని వంటపట్టించే కార్యక్రమానికి చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖర్ రావు దక్షిణ భారత దేశంలో పర్యటిస్తూ. పనిలో పనిగా ప్రముఖ గుళ్లను, గోపురాలను సందర్శిస్తున్నారు. అంతే కాకుండా కొడుకు కేటీఆర్ ను కూడా తనతో పాటుగా ప్రముఖ దేవాలయాలకు తిప్పుతుండడం గమనార్హం.

కేరళ, తమిళనాడు గుళ్లకు కేటీఆర్..! భక్తి భావం ఎంత పెరిగిందో చూడాలి..!!

కేరళ, తమిళనాడు గుళ్లకు కేటీఆర్..! భక్తి భావం ఎంత పెరిగిందో చూడాలి..!!

కేరళ, తమిళనాడు గుళ్లకు కేటీఆర్..! భక్తి భావం ఎంత
అన్ని అంశాల్లో తండ్రి చంద్రశేఖర్ రావును అనుసరించే కేటీఆర్ ఒక్క ఆద్యాత్మక విషయంలో అనుసరించకపోవడం నచ్చని చంద్రశేఖర్ రావు కావాలనే కొడుకు కేటీఆర్ ను భక్తి మార్గం వైపు మళ్లిస్తున్నాడనే చర్చ జరుగుతోంది. అందుకే ముందుగా కేరళ. తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ లో భక్తి భావం పెరిగి ఎంతవరకు ఆద్యాత్మికతను వంటబట్టించుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+