రేపు స్కూళ్లు, బ్యాంకులు అన్నీ బంద్.. ఎందుకంటే..?
నవంబర్ నెల అంటే పండుగల మాసం. ఈ మాసంలో వచ్చే పర్వదినాలు బ్యాంక్ లావాదేవీల షెడ్యూల్‌ను ప్రభావితం చేస్తాయి. అందుకే రేపు, అంటే నవంబర్ 5 (బుధవారం) మీ బ్యాంక్ పని ఉందో లేదో తెలుసుకోవడం అత్యవసరం. గురు నానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్ల కోసం ముఖ్యమైన సమాచారం ఇక్కడ ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడేస్ షెడ్యూల్ ప్రకారం... రేపు నవంబర్ 5 (బుధవారం) గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించబడింది. కాబట్టి, హైదరాబాద్ రీజియన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు మూసి ఉంటాయి.ఏపీలోని బ్యాంక్ కస్టమర్లకు మాత్రం ఊరట. నవంబర్ 5న విజయవాడ రీజియన్‌లో ఎటువంటి సెలవు లేదు. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయి.

తెలుగు రాష్ట్రాలే కాక, దేశంలోని పలు ముఖ్య నగరాల్లోనూ రేపు బ్యాంకులు మూసి ఉంటాయి. ఢిల్లీ, ముంబై, చండీగఢ్, జైపూర్, లక్నో, కోల్‌కతా, భోపాల్, రాంచీ, డెహ్రాడూన్, జమ్మూ వంటి ప్రాంతాల్లో కూడా గురు నానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.
బ్యాంకులు మూసి ఉన్నాయని కంగారు పడాల్సిన పనిలేదు. సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో, బ్యాంక్ హాలిడేస్ మీ అత్యవసర లావాదేవీలకు అడ్డుకావు. ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, బిల్లు పేమెంట్స్, ఆన్‌లైన్ షాపింగ్ లాంటి ఆర్థిక లావాదేవీలు ఏ మాత్రం ఆగవు.నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI ద్వారా మీరు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సులువుగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
అందుకే తెలంగాణలోని కస్టమర్లు రేపటి కోసం అవసరమైన బ్యాంక్ సేవలను ఈరోజే పూర్తి చేసుకోండి. ఏపీ కస్టమర్లు మాత్రం తమ పనులు యథావిధిగా కొనసాగించవచ్చు. ఈ సెలవు స్కూల్స్ , కాలేజీలకు కూడా వర్తిస్తుంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications