తెలంగాణలో నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు
హైదరాబాద్: నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ కార్మిక శాఖ ప్రకటనలో వెల్లడించింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

కాగా, ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు విస్తృతంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అధికార బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐంఎం, బీఎస్పీ, ఇతర రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ ఎవరి ధీమాను వారు వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంతోపాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర నేతలతోపాటు జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications