ఎన్నారై గౌతం రెడ్డి మృతి: హత్యా, ఆత్మహత్యనా? (ఫొటోలు)

హైదరాబాద్: ఎన్నారై గౌతంరెడ్డిది హత్యనా, ఆత్మహత్యనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన గౌతం రెడ్డి అనే ఎన్నారై శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఈ సంగటన బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కె.కిరణ్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అందించారు.

సికింద్రాబాదులోని పాత బోయిన్‌పల్లి, రాజారెడ్డి కాలనీకి చెందిన వెంకట్‌రెడ్డి చిన్న కుమారుడు గౌతమ్‌రెడ్డి(30) 2010 నుంచి కెన్యా దేశంలోని నైరోబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. 8 నెలల క్రితం కర్నూల్ జిల్లా, డోన్‌కు చెందిన యామినితో వివాహం జరిగింది.

వివాహం అనంతరం భార్యతో కలిసి కెన్యాకు వెళ్లిన ఆయన ఆగస్టు 29న నగరానికి వచ్చాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో గౌతమ్‌రెడ్డి వాకింగ్‌కు వెళ్తున్న తల్లికి చెప్పాడు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పలు చోట్ల వెతికినా ఫలితం కనిపించలేదు. గత నెల 30వ తేదీన బాధితుడి తండ్రి వెంకట్‌రెడ్డి బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

శవమై కన్పించాడు

శవమై కన్పించాడు

పాత బోయిన్‌పల్లిలోని మిలటరీ డెయిరీఫాం రోడ్డు పక్కన చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతదేహం కుళ్లిపోయింది..

మృతదేహం కుళ్లిపోయింది..

అప్పటికే ఆ మృతదేహం కుళ్లిపోయి, పెట్రోల్‌తో తగులబెట్టి ఉంది. ఆ శవం గౌతమ్‌రెడ్డిదిగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు సైతం ఆ శవం గౌతమ్‌రెడ్డిదేనని చెప్పారు.

స్థలంలో అవి కనిపించాయి..

స్థలంలో అవి కనిపించాయి..

దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. శవం లభ్యమైన స్థలంలో కాలిన పెట్రోల్ సీసా, అగ్గిపెట్టె, పర్సు లభించింది.

హత్యనా, ఆత్మహత్యనా..

హత్యనా, ఆత్మహత్యనా..

గౌతమ్‌రెడ్డిది హత్యానా ఆత్మహత్యనా అనే విష యం ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు సైతం ఈ విషయమై ఎటూ తేల్చలేకపోతున్నారు.

రెండు అపార్టుమెంట్ల మధ్య..

రెండు అపార్టుమెంట్ల మధ్య..

అయితే శవం రెండు అపార్ట్‌మెం ట్ల మధ్యన పడి ఉంది. అపార్ట్‌మెంట్లలో కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒకవేళ గౌతమ్‌రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటే అరుపులు వినిపించేవి.

అరుపులు వినిపించలేదు..

అరుపులు వినిపించలేదు..

అయితే అరుపులు ఏమి లేవని పక్కనే నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. అయితే హత్య చేసిన ఆనవాళ్లు కూడ అక్కడ లేవని పోలీసులు అంటున్నారు.

మరో చోట హత్య చేశారా..

మరో చోట హత్య చేశారా..

ఎక్కడైనా హత్య చేసి చెట్ల పొదల్లో పడేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు గౌతంరెడ్డికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదనే మాట కూడా వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+