ఎన్నారై భర్త నిర్వాకం: రమ్య శవాన్ని ఎయిర్‌పోర్టులో వదిలేసి వెళ్లిపోయాడు
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో వదిలేసి భర్త మహంత్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయాడు. రమ్య అనే వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె 10 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త మహంత్ ఫోన్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు తెలిపాడు.
రమ్య మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలోనే రమ్య మృతదేహాన్ని వదిలి మహంత్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. రమ్య పేరిట ఆస్ట్రేలియాలో సుమారు రూ. 2.5 కోట్ల బీమా చేసినట్లు సమాచారం.
పాస్‌పోర్టు ఉంటేనే బీమా వస్తుందని మృతురాలి బంధువులను డిమాండ్ చేసి పాస్‌పోర్టు తీసుకుని తిరుగుటపా కట్టాడని ఆరోపిస్తున్నారు. కాగా డబ్బు కోసమే రమ్యను భర్త మహంతే హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

మూడు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉంటున్న మహంత్‌తో హైదరాబాద్ కూకట్‌పల్లి వాసి రమ్య వివాహం జరిగింది. రమ్య భర్త మహంత్‌ను కఠినంగా శిక్షించాలంటూ రమ్య బంధువులు ఆందోళనకు దిగారు.
వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మహంత్ గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం రమ్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
భార్య చనిపోతే బీమా వాయిదాలు కట్టాలని మహంత్ బాధపడ్డాడని రమ్య కుటుంబ సభ్యులు అంటున్నారు. భార్య చనిపోతే రెండు వేల డాలర్లకు బాధపడ్డాడని వారన్నారు. భార్య కన్నా బీమా సొమ్మే అతనికి ముఖ్యమైందని అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications