మెడపై చేయి వేసి, అసభ్య ప్రవర్తన, పారిపోతుండగా వెంబడించి పిడిగుద్దుల వర్షం..
విశ్వనగరి భాగ్యనగరిలో మరో కీచకుడు రెచ్చిపోయాడు. ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించాడు. పారిపోతుండగా అతడిని వెంబడించగా మహిళకు ప్రతిఘటన ఎదురైంది. అయినా అసమాన ధైర్య సహసాలు ప్రదర్శించి అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. శనివారం రాత్రి మాదాపూర్‌లో ఈ ఘటన జరిగింది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్..
వారసిగూడకు చెందిన ఓ మహిళ.. మాదాపూర్ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె నాలుగు నెలల గర్భిణీ కూడా.. నైట్ షిప్ట్ కావడంతో శనివారం రాత్రి 8 గంటలకు ఆఫీసుకొచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో భర్త ఆమె పనిచేసే చోటకు రావడంతో.. భోజనం చేసేందుకు వైఎస్ఆర్ చౌరస్తాకు వెళ్లారు. డిన్నర్ ఫినిష్ అయ్యాక భర్త ఇంటికి వెళ్లిపోగా, ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ తిరిగి ఆఫీసుకు వెళ్తోంది.

మెడపై చేయి వేసి..
ఇంతలో ఎదురుగా వచ్చిన వ్యక్తి ఆమె మెడపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతను జూలాయిగా తిరిగి వ్యక్తి కాదు.. ఎన్ఆర్ఐ. విదేశాల్లో ఉండి ఇండియా వచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. దీంతో మహిళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తలెత్తి చూడగా అతను అక్కడినుంచి వెళ్లిపోయాడు. కానీ ఆమె వదల్లేదు. అతనిని వెంబడించి, నిలదీసింది. ఆమె ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా దాడిచేసేందుకు ప్రయత్నించాడు.

పిడిగుద్దుల వర్షం
అతగాడి ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ.. ప్రతీదాడికి దిగింది. పిడిగుద్దులు కురిపించి నారీశక్తి ఏంటో చూపించారు. తర్వాత కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకొని అతడిని పట్టుకొన్నారు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications