తెలంగాణలో రూ.80 వేల కోట్ల పెట్టుబడులకు ఎన్టీపీసీ గ్రీన్ సిగ్నల్ !
తెలంగాణ రాష్ట్రానికి ఎనర్జీ రంగంలో మరో గుడ్ న్యూస్ అందింది. దేశంలోనే అగ్రగామి విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భవిష్యత్ ప్రణాళికలను, పెట్టుబడుల వివరాలను సీఎం ముందు వివరించారు.
రూ.80,000 కోట్ల పెట్టుబడి..
కాగా రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులపై దాదాపు రూ.80,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎన్టీపీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు ద్వారా సుమారు 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేస్తున్నారు. ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ ద్వారా భూమి వినియోగం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.

దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ, నీటి ఆవిరి తగ్గింపు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. పెద్ద రిజర్వాయర్లు, జలాశయాలు ఈ ప్రాజెక్టులకు అనువైన వనరులని, వాటి వినియోగం ద్వారా రాష్ట్ర శక్తి ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ అవసరాల ఎక్కువ భాగం థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా తీరుతోంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల రూపంలో ఈ పెట్టుబడులు రాష్ట్రానికి కీలక మలుపు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, అవసరమైన అనుమతులు, వనరులు, మరియు మౌలిక సదుపాయాలు అందించడంలో ఎటువంటి వెనుకంజ ఉండదని సీఎం హామీ ఇచ్చారు.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!










Click it and Unblock the Notifications