తాత నమ్మకమే: లక్షలు వెచ్చించి లక్కీ నెంబర్ దక్కించుకున్న జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భారీ మొత్తం వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కుంచుకున్నాడు. తన బీఎండబ్ల్యూ కారు కోసం ఫ్యాన్సీ నెంబర్ వేలంలో పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ వేలంలో మరో ముగ్గురు కూడా పాల్గొన్నారు.
కాగా, తనకు లక్కీ నెంబర్ కావడంతో లక్షలు వెచ్చించడానికి కూడా వెనకాడలేదు జూనియర్ ఎన్టీఆర్. టీఎస్ 09ఈఎల్ 9999 నెంబర్‌ను ఎన్టీఆర్ దక్కించుకున్నాడు.

ఈ నెంబర్ కోసం రూ. 10.50లక్షలు వెచ్చించారు. ఈ నెంబర్‌లో దాదాపు అన్ని 9అనే అంకే ఉండటం గమనార్హం. 9 అంకే తెలుగుదేశం వ్యవస్థాపకుడు, జూ. ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామరావుకు కూడా లక్కీ నెంబర్ కావడం గమనార్హం.
కాగా, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications