Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విధేయతకే పట్టం .. నిరంజన్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేశారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అధినేత కేసీఆర్ వెన్నంటి ఉండి .. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు సీఎం కేసీఆర్.

వకీల్ గా కెరీర్ ఆరంభం

వకీల్ గా కెరీర్ ఆరంభం

1958 అక్టోబర్ 4న వనపర్తిలో రాంరెడ్డి దంపతులకు జన్మించారు నిరంజన్ రెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. కుమారుడిని ఉన్నత విద్య చదివించారు. డిగ్రీ చేశాక .. న్యాయ విద్య అభిలాసించాలనే కోరికతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ చేశారు. కోర్టులో లాయర్ గా రిజిస్ట్రేషన్ చేయించుకొని .. ప్రాక్టీస్ చేశారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించే వరకు వకీల్ గా ప్రాక్టీస్ చేశారు నిరంజన్ రెడ్డి.

ఉద్యమ పార్టీలో కీ రోల్

ఉద్యమ పార్టీలో కీ రోల్

గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ స్థాపించనప్పటి నుంచి వెన్నంటే ఉన్నారు సింగిరెడ్డి. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాల్లో బాసటగా నిలిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టేందుకు .. తమ నిరసన తెలిపేందుకు కార్యకర్తలను మమేకం చేయడంలో కీ రోల్ పోషించారు. కేసీఆర్ కు నమ్మినబంటులా ఉండి స్వ రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాడారు.

టీఆర్ఎస్ విక్టరీ .. నిరంజన్ లాస్ ...

టీఆర్ఎస్ విక్టరీ .. నిరంజన్ లాస్ ...

టీఆర్ఎస్ చేసిన ఉద్యమంతో స్వ రాష్ట్రం సిద్ధించింది. తొలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందింది. అయితే వనపర్తి నుంచి పోటీచేసినా నిరంజన్ రెడ్డి మాత్రం ఓడిపోయారు. దీంతో ఆయన క్యాబినెట్ పోర్టుపోలియా ఆశ ఆడియాసైంది. లేదంటే మొదటి మంత్రిమండలిలో చోటు దక్కేది. తన విధేయుడు ఓడిపోయారని భావించి ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ... మంత్రివర్గంలో చోటుపై ఆశలు చిగురించాయి. అనుకున్నట్టుగానే బెర్త్ దక్కింది. 2004 లో కూడా కొల్లాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు నిరంజన్ రెడ్డి.

పొలిట్ బ్యూరోలో చోటు ..

పొలిట్ బ్యూరోలో చోటు ..

టీఆర్ఎస్ అత్యున్నత నిర్ణయక మండలి .. పొలిట్ బ్యూరోలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి చోటు లభించింది. విధేయుడైన నిరంజన్ కు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించి .. తన వెన్నంటే ఉండేలా చూసుకున్నారు కేసీఆర్. తన బాస్ కేసీఆర్ కు చేదోడు వాదోడు ఉంటూ .. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు నిరంజన్ రెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+