Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు..! కూల్చివేయొద్దని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు..!!

హైదరాబాద్ : ఆదిలోనే హంస పాదు అంటే ఇదే. తెలంగాణ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించడం దాని మీద కొంత మంది కోర్టుకు వెళ్లి స్టే తేవడం సర్వ సాదారణం ఐపోయింది. తాజాగా తెలంగాణ లో ఉన్న సచివాలయ భవంతుల సముదాయాల కూల్చివేత నిర్ణయం కూడా తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చినట్టు లేదు. చంద్రశేఖర్ రావు ప్రకటించారో లేదో కొంతమంది ముఖ్యమంత్రి నిర్ణయం సరికాదంటూ కోర్టుకు మెట్తెక్కారు.

పిటీషనర్ వాదనలు వినడానికి హైకోర్ట్ గుడువు పెట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు కొత్త చిక్కు వచ్చింది.సెక్రటేరియట్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రసుత్తం ఉన్న భవనాన్ని కూల్చేది లేదంటూ 2016లో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ వేసిందని.. ఇప్పుడు పాత భవనాన్ని కూల్చి వేసి మళ్ళీ నూతన సచివాలయం నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు.సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి, భారీ భవనాలు నిర్మించేందుకు గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నించగా పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Recommended Video

    ఇక అభివృద్ధి బాటలో పల్లె పట్టులు
     Obstacles to Secretariat Demolition.!Filing affidavit not to be torn down..!

    దీంతో సచివాలయంను తరలించమని కోర్టులో అఫడవిట్‌ దాఖలు చేసింది. మరోసారి నూతన భవనం తెరపైకి రావడంతో.. ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.కాగా పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం శుక్రవారం పూర్తి వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది. ప్రస్తుత సచివాలయం మొత్తం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని చుట్టూ ఉన్న ఇతర భవనాలను సైతం స్వాధీనం చేసుకొని కూల్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+