కాచిగూడ - బెంగళూరు వందేభారత్ ప్రయాణ సమయం తగ్గింపు..!!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. త్వరలోనే మరో కొత్త వందేభారత్ సర్వీసును సికింద్రాబాద్ నుంచి ప్రారంభించేందకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం హైదరాబాద్‌-బెంగళూరు నగరాల మధ్య కొనసాగుతున్న వందేభారత్ ప్రయాణ సమయం మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి ఈ రైలు ఇక 8.15 గంటల్లోనే గమ్యం చేరుకోనుంది. దీని ద్వారా ప్రయాణీకులకు మరింత సమయం కలిసిరానుంది.

సమయం తగ్గింపు: కాచిగూడ - యశ్వంత్ పూర్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ వేగాన్ని పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ - బెంగళూరు నగరాల మధ్య వందేభారత్ లో ప్రయాణ సమయం 8.30 గంటలుగా ఉంది.

Officials Announces Kacheguda- Yeswanthpur Vandebharat running time reduced for 15 minutes

ఇక, 8.15 గంటల్లోనే గమ్యం చేరుకోనుంది. దీని ద్వారా ప్రయాణీకులకు 15 నిమిషాల సమయం కలిసి రానుంది. వేగం పెంపు నిర్ణయం ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ సర్వీసు ప్రారంభ సమయం నుంచి ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియా అంచనాలకు తగినట్లుగా ఉందని అధికారులు చెబుతున్నారు.

మరింత వేగంగా: తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలు ప్రారంభమై దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. తొలుత ప్రారంభించిన సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ కు ఇప్పటికీ ఆదరణ తగ్గటం లేదు. అదే విధంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు ఆశించిన ఆక్యుపెన్సీ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక..కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ కు మంచి స్పందన కనిపిస్తోంది.

ఈ లైన్ వాణిజ్య పరంగా కీలకమైనది కావటంతో సమయ పాలన మరింత ప్రాధాన్యత అంశంగా మారింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ రూట్ లో వేగం పెంచుతూ 15 నిమాషాల ప్రయాణ సమయం తగ్గించారు. దీంతో..ఇప్పుడు ఈ రూట్ లో మరింత వేగం పెంచటం ద్వారా ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలగనుంది.

కొత్త వందేభారత్: ఇక, త్వరలోనే సికింద్రాబాద్ - పూణే వందేభారత్ సర్వీసు అందుబాటులోకి రానుంది. అయితే, ఇది వందేసాధారణ్ కింద తీసుకొస్తారా లేక రెగ్యులర్ సర్వీసును ప్రారంభిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం వందేభారత్ కారణంగా సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్ల కు అధికారులు ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ఇప్పుడు కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ సమయం తగ్గింపు నిర్ణయం ప్రయాణీకులకు వేగంగా గమ్యం చేరుకోవటంలో ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+