Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజు -2, కొత్త స్టేషన్లు ఖరారు..!!

హైదరాబాద్ ప్రజలకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ఫేజ్-2కి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఇందులో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మార్గంలో కొత్తగా మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మార్గంలో నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 13 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో మరో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్‌ సమీపంలో మొదటి స్టేషన్‌తో ప్రారంభమై.. ఆ తర్వాత నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌ కూడలి, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట రోడ్‌ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు.

Officials proposes 13 new stations for Hyderabad meto second phase form Nagole to Chandrayanagutta

ఈ రూట్‌లో మెట్రోరైలు ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు కొన్ని ఫ్లైఓవర్ల వల్ల స్టేషన్ల కోసం భూసేకరణ అనివార్యంగా మారిందని అధికారులు నివేదించారు. ప్రైవేటు ఆస్తులు కనిష్ఠంగా సేకరించేందుకు ప్రణాళికలు చేపట్టలాని అధికారులకు ఆదేశించారు. అలాగే మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచనలు చేశారు. ఫేజు -2 లోభాగంగా చేపడుతున్న మార్గంలో భాగంగా ఈ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా నగరంలోని ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+