జన్వాడ ఫాంహౌస్ వద్ద మరోసారి అధికారుల సర్వే: నాలాను ఆక్రమించారా?

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని ఫాంహౌస్ వద్ద రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా మరోసారి సర్వే చేపట్టారు. ఆర్ఐ తేజ, మండల సర్వేయర్ సాయితేజ సహా ఇరిగేషన్ శాఖకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం.. నక్ష, డీజీపీఎస్ యంత్రాలతో సర్వే కొనసాగిస్తోంది.

జన్వాడ ఫాంహౌస్ పక్క నుంచి ఫిరంగి నాలా (బుల్కాపూర్ కత్వా) ప్రవహిస్తోంది. నాలాలో ఫాంహౌస్ ప్రహారీగోడ, గేటు నిర్మించారని ఆరోపణలున్నాయి. జన్వాడ ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

Officials survey again at Janwada Farmhouse

కాగా, ఇటీవలే ఇరిగేషన్,రెవెన్యూ అధికారులు జన్వాడ ఫాంహౌస్‌ను పరిశీలించి కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జన్వాడ ఫాంహౌస్ ను కూల్చొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి. అయితే, సిటీలో చెరువుల కబ్జా, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రూల్స్ ప్రకారమే వెళ్లాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామం సర్వే నెంబర్ 311 (311/7)లో 1,210 చదరపు గజాల్లోని 3894 చదరపు అడుగులతో నిర్మించిన ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఈ ఫాంహౌస్ తనది కాదని కేటీఆర్ తెలిపారు. ఈ ఫాంహౌస్ తన మిత్రుడిదని, తాను లీజుకు తీసుకున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+